మనిషికి అత్యంత ఆవశ్యకమైన వాటిలో మాట కూడా ఒకటి. మాటలు వస్తేనే, మాట్లాడడం వస్తేనే మనస్సులో ఉన్న భావాలను సరిగ్గా చెప్పేందుకు వీలు కలుగుతుంది. ఇక మాటలు రాకపోతే అలాంటి పరిస్థితి చెప్పేందుకు వీలు కాదు. కొందరికి పుట్టుకతోనే మాటలు రాకుండా ఉంటే, కొందరికి మాటలు వచ్చినా నత్తిగా మాట్లాడడం, అస్పష్టంగా మాట్లాడడం వంటి రుగ్మతలు కలుగుతాయి. అయితే అలాంటి సమస్యల కోసం ఆక్యుప్రెషర్ పరిష్కారం చూపుతోంది. ఆక్యుప్రెషర్ ద్వారా శరీరంలోని ఓ భాగంపై ఉన్న ప్రత్యేక పాయింట్లను నిత్యం సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా పైన చెప్పిన సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. ఆ ఆక్యుప్రెషర్ పాయింట్లేమిటో ఇప్పుడు చూద్దాం.
పైన ఇచ్చిన బొమ్మను పరిశీలించారా. అందులో దవడ కింది భాగంలో మూడు ఆక్యుప్రెషర్ పాయింట్లు ఉన్నాయి. వాటిని ఇంగ్లిష్‌లో Three needle of Jin (థ్రీ నీడిల్స్ ఆఫ్ జిన్) పాయింట్లని కూడా పిలుస్తారు. చేతిని దవడ కిందుగా ఉంచి పట్టుకుంటే చూపుడు వేలు తగిలే ప్రదేశంలో మొదటి పాయింట్, మధ్యవేలు తగిలే ప్రదేశంలో రెండో పాయింట్, ఉంగరపు వేలు తగిలే ప్రదేశంలో 3వ పాయింట్ ఉంటాయి. వీటిని నిత్యం మర్దనా చేస్తూ ఉండాలి.
పైన చెప్పిన 3 పాయింట్లను నిత్యం వీలైనన్ని సార్లు సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ పాయింట్లపై ఒత్తిడిని కలిగిస్తూ మర్దనా చేయాల్సి ఉంటుంది. దీంతో మాట్లాడే శక్తికి సంబంధించిన నరాలు ఉత్తేజమవుతాయి. ఈ క్రమంలో మాటలు సరిగ్గా రాకపోవడం, అస్పష్టంగా మాట్లాడడం, నత్తిగా మాట్లాడడం వంటి సమస్యలు క్రమంగా దూరమవుతాయి. చైనీస్ సాంప్రదాయ వైద్యంలో ఈ థెరపీని ఎప్పటి నుంచో పాటిస్తున్నారట. దీని వల్ల ఆయా సమస్యల నుంచి చక్కని ఉపశమనం కలుగుతుందట.
The post ఇలా చేయండి…నత్తి ని దూరం చేసుకోండి. ఎలానో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2E45RiM


No comments:
Post a Comment