etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, May 11, 2019

ఎకో ఫ్రెండ్లీ ఇంజన్‌.. ప్రత్యేక తెలిస్తే షాక్‌ అవుతారు, నిజంగా ….!

వాయు కాలుష్యానికి ప్రధాన కారణం.. వాహనాలు. మన దేశంలో వీటి వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటికో బైక్‌ అయినా తప్పనిసరి అన్నట్లు మారాయి పరిస్థితులు. ఈ వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండేవన్ని కాలుష్య.. అనారోగ్య కారకాలే. అలా కాకుండా ఈ వాహనాల నుంచి వెలువడే పొగలో ఆక్సిజన్‌ ఉంటే. వినడానికి కాస్త అత్యాశగా అనిపిస్తున్న ఇది మాత్రం వాస్తవం. కొయంబత్తూరుకు చెందిన ఓ మెకానికల్‌ ఇంజనీర్‌ ఈ అద్భుతాన్ని నిజం చేసి చూపాడు. హైడ్రోజన్‌ వాయువును ఇందనంగా వినియోగించుకుని.. ఆక్సిజన్‌ను విడుదల చేసే ఓ ఎకో ఫ్రెండ్లీ ఇంజన్‌ని కనుగొన్నాడు.

సౌందిరాజన్‌ కుమారసామి అనే మెకానికల్‌ ఇంజనీర్‌ ఈ అద్భుతాన్ని సృష్టించాడు. ఈ క్రమంలో అతను మాట్లాడుతూ.. ‘ఇది నా కల. దీన్ని సాధించడం కోసం దాదాపు పదేళ్ల నుంచి శ్రమిస్తున్నాను. హైడ్రోజన్‌ని ఇందనంగా వినియోగించుకుని.. ఆక్సిజన్‌ని విడుదల చేసే ఈ ఎకో ఫ్రెండ్లీ ఇంజన్‌ని కనుగొన్నాను. ప్రపంచంలో ఇలాంటి రకమైన ఆవిష్కరణ ఇదే మొదటిది. దీన్ని భారతదేశంలో వినియోగంలోకి తీసుకురావాలనేది నా కల. అందుకోసం ప్రతి కార్యాలయం తలుపు తట్టాను. కానీ ఎవరూ దీనిపట్ల సానుకూలంగా స్పందించలేదు. దాంతో జపాన్‌ ప్రభుత్వాన్ని కలిసి దీని గురించి వివరించాను. వారు నాకు అవకాశం ఇచ్చారు. త్వరలోనే ఈ ఇంజన్‌ని జపాన్‌లో ప్రారంభిచబోతున్నాను’ అని తెలిపారు సౌందిరాజన్‌.

The post ఎకో ఫ్రెండ్లీ ఇంజన్‌.. ప్రత్యేక తెలిస్తే షాక్‌ అవుతారు, నిజంగా ….! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2JerZuY

No comments:

Post a Comment