టీవీ-9 సీఈవో పదవికి రవి ప్రకాశ్ శుక్రవారం రాజీనామా చేశారు. తన రాజీనామాకు ముందు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌కు ఆయన ఒక లేఖ రాశారు. ‘‘నేను, రవి ప్రకాశ్.. టీవీ-9 వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాజీనామా చేసే ముందు ఈ అంశాలను మీ ముందుంచుతున్నాను. మీరు రాజకీయ నేతల అండదండలతో జర్నలిజాన్ని నాశనం చేసే లక్ష్యంతో పనిజేస్తున్నారు. స్వతంత్రంగా పనిచేసే టీవీ-9 పనిపట్టాలని ఈ చర్యలకు దిగారు. అసత్యాలతో మోసగించి, వెనుక దారిలో టీవీ 9 సంస్థలో చొరబడ్డారు. ఎన్‌సీఎల్‌టీ కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తూ సంస్థలో మార్పులు ప్రారంభించారు. ఓ ప్రొఫెషనల్ కంపెనీ సెక్రటరీని బెదిరించి ఏబీసీఎల్ అసలు డైరెక్టర్ల మీద తప్పుడు కేసులు పెట్టారు. ‘రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్’లో అక్రమ మార్గం ద్వారా నలుగురు డైరెక్టర్లను చొప్పించి పోలీసుల సహాయంతో టీవీ-9ను కంట్రోల్‌లోకి తీసుకున్నారు. తప్పుడు ఫిర్యాదుతో తప్పుడు కేసులతో నన్ను వేధించే ప్రయత్నాన్ని పూర్తిస్థాయిలో చేశారు.
పోలీసులను యథేచ్ఛగా వినియోగించి నా మీద అర్థం పర్థం లేని కేసులు వేసి మీ చేతుల్లోని మీడియాలో అసత్య ప్రచారం చేశారు. నాతో పనిచేసే వారిని వేధించి, పోలీసు దాడులతో భయోత్పాతానికి గురి చేసి బలవంతంగా కంపెనీ స్వాధీనం చేసుకున్నారు. మీరెన్ని అక్రమాలు, అన్యాయాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా నేను మీ సాటి షేర్ హోల్డర్‌గా, సంస్థలో నా వాటాకు ప్రతినిధిగా మీ పక్కనే ఉంటాను. దేశంలో జర్నలిజాన్ని కాపాడడానికి, పాత్రికేయ విలువల్ని రక్షించడానికి, మీడియా సంస్థల్లో రాజకీయ జోక్యాన్ని నిలువరించడానికి నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది’’..అంటూ ఆయన రాసిన లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
The post ఎంత వేధించినా మీ పక్కనే ఉంటా: రవిప్రకాశ్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2VRp0yw
No comments:
Post a Comment