etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, June 6, 2019

ప్రపంచకప్‌లో ఆడతానన్న డివిలియర్స్.. తిరస్కరించిన బోర్డు

సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో ఏబీ డివిలియర్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. తనదైన శైలీ ఆటతో డివిలియర్స్ సఫారీలకు ఎన్నో విజయాలను కట్టబెట్టాడు. ప్రత్యర్థి ఎంత బలంగా ఉన్న ఏబీడీ తన బ్యాటింగ్‌తో వారికి చుక్కలు చూపిస్తాడు. అలాంటి దిగ్గజ క్రికెటర్ అనూహ్యంగా గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. ఐపీఎల్ 11వ సీజన్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు డివిలియర్స్ ప్రకటించాడు. దీంతో క్రికెట్ అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారు.

ఇక అసలు విషయానికొస్తే.. క్రికెట్ సౌతాఫ్రికా ప్రస్తుతం ప్రపంచకప్‌లో కష్టాలు ఎదురుకుంటుంది. ఆడిన మూడు మ్యాచుల్లో సౌతాఫ్రికా ఓటమిపాలైంది. మరో మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడితే.. ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ దశలో డివిలియర్స్ సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఓ అమూల్యమైన ఆఫర్ ఇచ్చాడు. తాను మళ్లీ ప్రపంచకప్ ఆడుతానని డివిలియర్స్ బోర్డును కోరాడు. అయితే డివిలియర్స్ ప్రతిపాదనని బోర్డు నిరభ్యంతరంగా తిరస్కరించింది.

డివిలియర్స్ మళ్లీ జట్టులోకి వస్తే.. అతని రిటైర్‌మెంట్ తర్వాత జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఎవరినో ఒకరిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితి వస్తుంది. అది మాత్రమే కాక.. డివిలియర్స్ గత ఏడాది మేలో అంటే.. సరిగ్గా క్రికెట్ ప్రపంచకప్‌ ప్రారంభంకావడానికి సంవత్సరం ముందు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో ప్రపంచకప్‌కి పంపే జట్టు ఎంపికలో బోర్డును కాస్త తికమక పెట్టాడు. ఆ తర్వాత 35 సంవత్సారాలు దాటిన ఈ క్రికెటర్ ప్రస్తుతం జట్టులో సరితూగడేమో అని మేనేజ్‌మెంట్ భావించింది. దీంతో అతన్ని తిరిగి జట్టులోకి తీసుకోవాలనే ప్రతిపాదనను బోర్డు తిరస్కరించింది.

The post ప్రపంచకప్‌లో ఆడతానన్న డివిలియర్స్.. తిరస్కరించిన బోర్డు appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2wI9zu4

No comments:

Post a Comment