etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, July 7, 2019

10రూపాయలకే చీర అన్నారు, అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగిందో చుడండి.

ఓ షాపింగ్‌ మాల్‌ పెట్టిన చీర ఆఫర్‌ మహిళలకు తంట తెచ్చింది. రూ.10 చీర సంగతేమో కానీ.. ఉన్న వస్తువులు పోయి కొందరు మహిళలు.. గాయాలపాలై మరికొందరు మహిళలు లబోదిబోమన్నారు. సిద్దిపేటలోని సిఎంఆర్‌ షాపింగ్‌ మాల్‌లో శనివారం తొక్కిసలాట జరిగింది. షాపు నిర్వాహకులు రూ.10 లకే చీర ఆఫర్‌ పెట్టడంతో పేదలు, మధ్య తరగతి మహిళలు భారీగా వచ్చారు. నిర్వాహకులు ఒక్కసారిగా గేట్లు తెరవడంతో.. మహిళలు ఒకరిని ఒకరు తోసుకున్నారు. తొక్కిసలాటలో చాలా మంది మహిళల నగలు పోయాయి, మరికొందరికి ఫోన్లు పోయాయి. చాలా మందికి గాయాలయ్యాయి. అమాయక ప్రజలను సొమ్ము చేసుకుంటున్నారు వ్యాపారులు. ఆషాడం సేల్స్‌ పేరుతో మహిళలను అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్‌లో ఏకంగా ఒక షాపింగ్ మాల్ 10 రూపాయలకే ఒక చీర అంటూ ప్రకటనలు గుప్పించింది. దీంతో అమాయక మహిళలు తక్కువ ధరకే చీరలు వస్తున్నాయంటూ షాపు ముందు క్యూ కట్టారు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున మహిళలు షాపు వద్ద గుమికూడి చీరల కోసం పోటీ పడ్డారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. పలువురికి గాయాలు అయ్యారు.

ఆషాడం సెల్స్‌ పేరుతో షాపు యజమాని మోసం చేస్తున్నాడని వ్యక్తం చేశారు మహిళలు ఆగ్రహం. ఇలాంటి ప్రకటనతో చివరకు తమ ప్రాణం మీదకు వచ్చే పరిస్థితి తలెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్ది.. షాపు యజమానిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 10 రూపాలయలకు ఒక ఖర్చీఫ్ కూడా రాని పరిస్థితుల్లో ఒక చీర ఏవిధంగా వస్తుందని .. వాటి నాణ్యత ఎంత అని మహిళలు ఆలోచించాలని కోరారు పోలీసులు. ఇలాంటి ఆకర్షణీయమైన ప్రకటనలు చూసి దక్కువ ధరకే చీరలు వస్తున్నాయని వేలాది మంది గుమిగూడి తోపులాట జరిగితే ప్రాణాలు కూడా పోయే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు చూసి మోసపోవద్దని ప్రజలను కోరారు పోలీసులు..

The post 10రూపాయలకే చీర అన్నారు, అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగిందో చుడండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2XtXl8w

No comments:

Post a Comment