వాస్తవానికి బిగ్ బాస్ రెండో సీజన్ సమయంలో కూడా నిర్వాహకులపై నటి మాధవీలత ఇలాంటి ఆరోపణలు చేశారు. పలు టీవీ ఛానళ్లకు ఎక్కి మరీ ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు మూడో సీజన్ ప్రారంభమవబోతున్న తరుణంలో శ్వేతారెడ్డి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. బిగ్‌బాస్ 3 రియాల్టీ షోలో చీకటి కోణాలు ఎన్నో వున్నాయని, మహిళలను షో కో-ఆర్డినేటర్‌లు అసభ్యకరమైన ప్రశ్నలు వేస్తున్నారని శ్వేతారెడ్డి ఆరోపించారు. అది బిగ్ బాస్ హౌసా?..బ్రోతల్ హౌసా?…అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆమె…మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. బిగ్‌బాస్ 3 రియాలిటీ షో ముసుగులో సెక్స్, కిస్‌ల కోసం కొందరు కో ఆర్డినేటర్‌లు మహిళా కంటెస్టెంట్‌లతో మాట్లాడుతున్నారన్నారు.
తమ బాస్‌ను ఎలా శాటిస్‌ఫై చేస్తారని కో ఆర్డినేటర్ అడగడం ఏమిటని ప్రశ్నించారు. శ్యామ్, అభిషేక్, రఘు, రవికాంత్‌లు బిగ్‌బాస్ 3లో వివిధ డిపార్ట్‌మెంట్‌లకు కో ఆర్డినేటర్‌లుగా వ్యవహరిస్తున్నారన్నారు. తన షేప్‌తో పాటు పలు ప్రశ్నలు అడగడంతో తీవ్రంగా బాధపడ్డానన్నారు. కేవలం 14 మందిని ఎంపిక చేసేందుకు 150 మంది అగ్రిమెంట్‌లు ఎందుకు తీసుకున్నారని శ్వేతారెడ్డి ప్రశ్నించారు.
చాలామంది ఆరోపిస్తున్నట్టు తాము పబ్లిసిటీ కోసమో, డబ్బు కోసం ఈ పోరాటం చేయడం లేదని ఆమె వివరించారు. బిగ్‌బాస్ రియాల్టీ షో 3ను తక్షణమే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లో రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కో ఆర్డినేటర్ల ప్రవర్తనపై ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున స్పందించాలన్నారు. నాగార్జునకు మహిళల్లో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ వుందని, ఆయన చొరవ తీసుకుంటే ఇటువంటి ఘటనలు పునరావృతం కావన్నారు. మహిళా చేతన ప్రతినిధి కత్తి పద్మ మాట్లాడుతూ బిగ్‌బాస్ 3 అనే షో పనికిమాలిన కార్యక్రమమని మండిపడ్డారు. ఇటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలతో అమాయకమైన ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న వారిపై ప్రభుత్వాలు కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీఓడబ్ల్యు లక్ష్మీ, రమణకుమారి, నాగమణి, లావణ్య, రోహిణి పాల్గొన్నారు.
The post నాగార్జున గారు తలుచుకుంటే బిగ్‌బాస్ 3 లో ఇలాంటి అరాచకాలు జరగవు : శ్వేతారెడ్డి appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2LNN14Y
No comments:
Post a Comment