etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, July 11, 2019

నిన్న మ్యాచ్ లో ఉహించని సంగటన, నో బాల్‌కు ధోనీ రనౌట్, ఎలానో చుడండి.

వరల్డ్ కప్ సెమీస్‌లో టీమిండియా ఓటమిపై భిన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. 7వ బ్యాట్స్‌మెన్‌గా ధోనీని పంపడం వ్యూహాత్మక తప్పిదం అని టీమిండియా మాజీ క్రికెటర్స్ లక్ష్మణ్, గంగూలీ అభిప్రాయపడ్డారు. అయితే.. కొందరు నెటిజన్లు మాత్రం ఊహించని వాదన తెరపైకి తెచ్చారు. టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన అంతర్గత రాజకీయాల వల్ల అంబటి రాయుడు వరల్డ్ కప్‌కు, జట్టుకూ దూరమయ్యాడని, రాయుడు ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని వాదిస్తున్నారు. అయితే టార్గెట్ చేధించే క్రమంలో ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ మిస్టర్ కూల్ ధోనీ పరుగులు రాబట్టే క్రమంలో ఏ మాత్రం తడబాటుకు గురి కాలేదు. ఓవర్లు అయిపోవడంతో ఇంకా 9బంతులు మిగిలి ఉండగా 48.3బంతికి 2రన్స్ తీసే ప్రయత్నం చేసి రనౌట్ అయ్యాడు.

కానీ, అది నో బాల్. అంపైర్లు ఈ విషయాన్ని గమనించలేదు. నెటిజన్లు మాత్రం పసిగట్టేశారు. అంపైర్లు నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ట్విట్టర్ వేదికగా స్క్రీన్ షాట్‌లు తీసి రచ్చ చేస్తున్నారు. థర్డ్ పవర్ ప్లే అంటే 40 నుంచి 50ఓవర్ల సమయంలో 30యార్డ్ సర్కిల్‌కు దగ్గర్లో 5మంది ఫీల్డర్ల కంటే ఎక్కువ మంది ఉండకూడదు. కానీ, అదే సమయంలో ఆరుగురు ఫీల్డర్లు ఉన్నారు. ఇది కెప్టెన్ విలియమ్సన్, అంపైర్ల నిర్లక్ష్యంతో అవుట్‌గా ఇచ్చారు, అదే ఆ నో బాల్ పసిగట్టి అవుట్ ఇవ్వకపోయి ఉంటే మ్యాచ్ పరిస్థితి ఇంకెలా ఉండేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరేమో అది నో బాల్ అని తెలిసి ఉంటే మహీ తర్వాతి బంతికి ఫ్రీ హిట్ తీసుకుని లక్ష్యాన్ని మరింత చేరువ చేసేవాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

The post నిన్న మ్యాచ్ లో ఉహించని సంగటన, నో బాల్‌కు ధోనీ రనౌట్, ఎలానో చుడండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2G5iMlC

No comments:

Post a Comment