etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, July 6, 2019

ఎప్పుడు రిటైర్మెంట్ అవుతాడో చెప్పిన మహేంద్రసింగ్ ధోనీ, ఎప్పుడో తెలుసా …?

ధోనీ టెస్టులు మరియు వన్ డే ఇంటర్నేషనల్ లో ఒక భారతీయ కెప్టెన్ అత్యధిక విజయాలతో అనేక కెప్టెన్సీ రికార్డులను, మరియు అత్యథిక బ్యాక్ టు బ్యాక్ వన్డేల్లో విజయాల భారతీయ కెప్టెన్. అతను 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ లోనె జట్టుకు శ్రీలంక మరియు న్యూజిలాండ్ తొ పొరాడి విజయం తీసుకవచ్చాడు. తన సారథ్యంలో భారతదేశం 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ, 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మరియు 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోనీ 91 పరుగులతో అజేయంగా నిలిచాడు అందుకు అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

వరల్డ్‌కప్ అనంతరం ఇండియన్ క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే ఉహాగానాల నేపథ్యంలో మిస్టర్ కూల్ తాజా స్పందించారు. స్థానికంగా ఓ మీడియాతో మాట్లాడిన ధోనీ.. క్రికెట్‌కు తాను ఎప్పుడు గుడ్‌బై చెప్తాననే విషయంలో తనకే స్పష్టత లేదన్నారు. అయితే.. వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంకతో ఆడే ఆఖరి లీగ్ మ్యాచ్‌కు ముందే తాను రిటైర్మెంట్ ప్రకటించాలని కొందరు కోరుకుంటున్నారని ధోనీ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో జట్టు ఆటగాళ్లను కానీ, యాజమాన్యాన్ని కానీ నిందించడం లేదని మిస్టర్ కూల్ స్పష్టం చేశారు. కాగా.. ఇంగ్లడ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో ధోనీ ఆటతీరు లేదు. ముఖ్యంగా ఆఫ్గనిస్థాన్, ఇంగ్లాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో ధోనీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

The post ఎప్పుడు రిటైర్మెంట్ అవుతాడో చెప్పిన మహేంద్రసింగ్ ధోనీ, ఎప్పుడో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2XJuEDR

No comments:

Post a Comment