పెద్దాపురం నియోజకవర్గంలో ఇంచార్జి మార్పు, నియోజకవర్గ ప్రస్తుత పరిస్థితి దానిలోని కోణాలు, పార్టీ, క్యాడర్, ప్రజలు, తోట ఫ్యామిలీ, తోట నరసింహం, ఏమిటి పెద్దాపురం అని అనుకొంటున్నారా వైసీపీ పార్టీ కీలకంగా తీసుకున్న జిల్లా ఏది అంటే అది తూర్పుగోదావరి జిల్లా అని చెప్పాలి. ఇక్కడ కాపులు అధికం వైసీపీ కాపులకు రిజర్వేషన్ సాధ్యం కాదని ప్రకటించింది ఇక్కడే అయితే వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వాన్ని స్థాపించింది. అయితే కాకినాడ పార్లమెంట్ విషయానికి వస్తే అత్యంత కీలక మైన పెద్దాపురం లో మాజీ ఉప ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్ నిమ్మకాయల చినరాజప్ప పై తోట నరసింహం భార్య శ్రీమతి తోట వాణి పోటీచేసి 3900 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ముఖ్యం గా ఇక్కడ జనసేన ప్రభావం అధికంగా వుంది 29000 ఓట్లు పొందింది. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అనుకుంటున్నారా.
తోట నరసింహం పార్టీలోకి 22 రోజుల ముందు జాయిన్ అయ్యారు, అతి తక్కువ టైం లో రాజప్ప ని ఢీకొట్టారు, తోట నరసింహం గారివల్ల జగ్గంపేట, పిఠాపురం, కాకినాడ రురల్, అమలాపురం, తుని అసెంబ్లీ స్థానాలలో వైసీపీ కి బాగా మైలేజ్ వచ్చింది. ఎంపీ సిటు కూడా చాల ఈజీ గ నెగ్గింది. తోట నరసింహం mla గా మంత్రి గా ఎంపీ గా పనిచేసారు. అలాంటి తోట నరసింహం గారికి ఇంచార్జి అనే చిన్న ముక్క వైసీపీ పార్టీ దూరం చేసింది. ఎందుకు అన్న దానికి కారణం లేదు, ఓడిపోయారని ఇంట్లో కూర్చోలేదు తోట వాణి , తోట నరసింహం పెద్దాపురం అందుబాటులో వుంటూ పెద్దాపురం ప్రజలకు 45 రోజుల్లో వీళ్ళు గెలిచి ఉంటే బాగుణ్ణు అని అనుకునేలా చురుకుగా పని చేసారు. గత చరిత్ర మాదిరి ఓడినవాళ్ళకి ఇంచార్జి అని చురుకుగా పని చేయాలని చూసారు. టీడీపీ వాళ్ళు సైతం భయపడేలా కానీ వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంచార్జి గ దావులూరి దొరబాబు ని ప్రకటించింది. ఒక్కసారిగా నియోజకవర్గం, క్యాడర్ అయోమయం లో పడింది , తోట నరసింహం ఆరోగ్యం దృష్ట్యా సరిఅయిన గౌరవం టీడీపీ ఇవ్వలేదని వైసీపీ పార్టీలోకి వచ్చారు.
తోట నరసింహం టీడీపీ నుంచి వచ్చిన తరువాత వేలాది మంది వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు, అన్ని నియోజకవర్గాలలో టీడీపీ ని వదిలి వచ్చారు. వైసీపీ అధికారం లోకి వచ్చిన 45 రోజులతరవాత ప్రకటన చేసిన, తరువాత అయోమయం లో కార్యక్రత్తలు వున్నారు. లేనిపోని బురద బీజేపీ లోకి వెళ్తున్నారు అంటూ పుకార్లు, ఎన్నికల్లో కస్టపడి తిరిగి గెలుపుకు కృషి చేసిన వాళ్ళు ఈరోజు పక్కన బెట్టి , అసలు పార్టీకి ఓటువేయకుండా చేసి, ఓటమి కి కృషి చేసిన వారికీ పదవులు ఇవ్వటం వైసీపీ నిర్ణయాన్ని కార్యక్రత్తాలు ఎలాచూసిన టీడీపీ వారు నవ్వి పండగ చేసుకుంటున్నారు.
ఇదే తోట ఫ్యామిలీ, మొదటిసారి పార్టీ పెట్టినప్పుడు జై జగన్ అని అన్న తోట గోపాలకృష్ట గారు మరణం చెందటం తో పార్టీని భుజాలపై 9 సంత్సరాలు కష్టపడ్డా తోట నాయుడిని కాదని చెప్పకుండా కోఆర్డినేటర్ తొలగించారు. అదే తోట ఫ్యామిలీ కి వైసీపీ సత్కారం చేస్తుందా, పెద్దాపురం నియోజక వైసీపీ క్యాడర్ పరిస్థితి ఏమిటి, దీనిపై వైసీపీ ఏమి ఆలోచిస్తుంది, పెద్దాపురం పై జగన్ ఆలోచన ఏమిటి, ఏమి అర్ధం కాకా సైలెంట్ గా ఉండటం మేలని వారు వాపోతున్నారు. ఇంచార్జి మీ వాణి మా దొరబాబా అని టీడీపీ వాళ్ళు సైతం వెక్కిరిస్తున్నారు, అని వైసీపీ కార్య కర్త్తలు సోషల్ మీడియా లో హల చల్ చేస్తున్నారు. సామాన్య ప్రజలు సైతం ముక్కున వేలు వేసుకుంటున్నారు.
పెద్దాపురం ఇంచార్జి మార్చారని సింగపూర్ వైద్యానికి వెళ్లిన తోట నరసింహం గారు తెలుసుకుని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, పార్టీ నిర్ణయం జగన్ గారిపై నమ్మకం వుంది అని తమకు ఓటు వేసిన 60000 వేలమందికి ఏ కష్టం వచ్చిన తోడు ఉంటానని, చెప్పారని సమాచారం. పోటీ చేసిన 23 మందిని ఒకేసారి ప్రకటించకుండా పెద్దాపురం ప్రకటించటం ఏమిటో, పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఏమిటో వైసీపీ పార్టీ ని నమ్ముకుని వచ్చిన తోట ఫ్యామిలీ కి జగన్ గారు ఏవిధం గా సమాధానం చెబుతారో చూడాలి.
కాకినాడ న్యూస్.
The post ఆకాశంలో సూరీడు .. మన తోట నరసింహం appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/2LLEAaa
via IFTTT
No comments:
Post a Comment