అంజూరంను మంచి మేడి, సీమ అత్తి, తినే అత్తి అని కూడా అంటారు. ఇది మోరేసి కుటుంబానికి చెందినది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఫికస్ కారికా. అంజూర చెట్టు అందమైన, ఆసక్తికరమైన, విశాలంగా పెరిగే చిన్న చెట్టు. ఇది ఎక్కువగా ఎత్తు కంటే విశాలంగా పెరుగుతుంది. ఇది సుమారు 15 నుంచి 30 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఈ చెట్టు యొక్క బెరడు నున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది. ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి. ఈ చెట్టు ఆకులు 4 అంగుళాల పొడవు కలిగి 3 లేక 5 భాగాలుగా చీలి ఉంటాయి. ముఖ్యంగా వీటి ఆకులు బొప్పాయి చెట్టు ఆకుల ఆకారంలో ఉంటాయి.
ఈ చెట్టు యొక్క ఫలాన్ని అంజూర ఫలం అంటారు. గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరి పండు ఆకారంలో ఉండే ఈ పండు 1 నుంచి 4 అంగుళాల పొడవు ఉంటుంది. ఈ పండ్లు పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం, కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు వంగ పండు రంగులో ఉంటాయి. తినదగిన ఈ పండ్ల కోసం సహజసిద్ధంగా పండే ఇరాన్ మరియు మెడిటెర్రానియన్ తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరాన్ని పెంచుతున్నారు. మొట్టమొదట పారసీ రాజ్యం నుండి వచ్చిన అంజూరాన్ని 5 వేల సంవత్సరాలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడింది.
ఆకర్షణీయమైన రంగూ, రూపం అంజీరకు లేవు. కానీ ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అద్భుతమైన రుచితో పాటు పోషక విలువలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా డ్రైఫ్రూట్స్ రూపంలోనే అంజీర్ వాడకం ఎక్కువ. రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు అంజీరలో ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వారైనా అంజీరను తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని అంజీర అందిస్తుంది. శారీరక, మానసిక సమస్యలను తగ్గిస్తుంది. క్యాన్సర్ తరహా గడ్డల నివారణకు అంజీర్ బాగా పనిచేస్తాయి.
అంజీరలో అధికంగా ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది. ఈ పండ్లు మధుమేహం(షుగర్), ఆస్తమా, దగ్గు వంటి వ్యాధుల్ని తగ్గిస్తాయి. ఊపిరితిత్తుల సమస్యలకు ఇవి మంచి మందుగా కూడా పనిచేస్తాయి. ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు బలహీనంగా మారిన వాళ్లు వీటిని ఎక్కువగా తీసుకుంటే త్వరగా బరువు పెరుగుతారు. మలబద్దక సమస్యను తొలగించడానికి ఈ పండు పెట్టింది పేరు. అజీర్తిని అరికడుతుంది. వీటిలోని క్యాల్షియం ఎముకల వృద్ధికి, పుష్టికీ దోహదపడుతుంది.
The post అంజీర పండు రోజు తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే, తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2YtrC2W
No comments:
Post a Comment