మొదట్లో భారతీయ జనతా పార్టీలో చేరడంతో శివాజీ రాజకీయాల్లో ప్రవేశించాడు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తరువాత, రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా సాధించేందుకు కృషి చేసాడు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితిలో చేరి ఉద్యమించాడు. హోదా ఇవ్వనందుకు తన స్వంత పార్టీ భాజపాను విమర్శించాడు. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా 2015 మే 3 న గుంటూరులో 48 గంటల నిరాహారదీక్ష చేసాడు. తదనంతర కాలంలో పార్టీకి రాజీనామా చేసాడు. 2018 మార్చి 22 న చేసిన ఒక పత్రికా ప్రకటనలో, ఒక జాతీయ రాజకీయ పార్టీ దక్షిణ భారత దేశంలో విస్తరించేందుకు గాను, “ఆపరేషన్ ద్రవిడ” అనే కార్యక్రమం చేపట్టిందని, అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌లో “ఆపరేషన్ గరుడ”ను నిర్వహిస్తోందనీ చెప్పాడు.
ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని తాను త్వరలో చెబుతానని నటుడు శివాజీ చెప్పుకొచ్చారు. అన్ని పార్టీల్లో తన శ్రేయోభిలాషులు ఉన్నారని, జమిలి ఎన్నికలు వస్తే దేశంలో ప్రాంతీయ పార్టీలే ఉండవని జోస్యం చెప్పారు. జాతీయ పార్టీలోనే చేరుతానని, తనకు సినిమా చూపించిన వాళ్లకి త్రీడీ సినిమా చూపిస్తానని శివాజీ హెచ్చరించారు. పెట్టుడు కేసులకు విచారణకు ఎందుకు రావాలని ప్రశ్నించారు. ‘‘మీ వల్ల నా పిల్లల చదువులు పాడయ్యాయి. ఇంటర్ వ్యవహారంలో కారకులపై కేసు ఎందుకు పెట్టలేదు. సునామీలా ఎప్పుడైనా రాజకీయాల్లోకి వస్తాను. ఏపీలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు. ఆశావర్కర్లు రోడ్డున పడ్డారు. రియల్ ఎస్టేట్ కుదేలైంది’’ అని శివాజీ ఆరోపించారు.
అయితే చంద్రబాబు ఎప్పుడూ ప్రజల అభివృద్దిని కోరుకున్నారని.. తనకు కులపిచ్చి ఉంటే చంద్రబాబు కంటే పెద్ద రాజకీయ నేత అయ్యేవాడినన్నారు. బీజేపీలో ఉంటే తన పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నందుకే తనను టార్గెట్ చేశారన్నారు శివాజీ. తెలంగాణకు పోర్ట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించానని.. తనపై కక్షకట్టారని విమర్శించారు. రావులు, రెడ్లకు భయపడే వాడిని కాదన్నారు. తాను ఎక్కడికి పారిపోలేదని.. దుర్మార్గాలు చేసి ఉంటే బెయిల్ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. అంత కక్ష ఉంటే నన్ను కాల్చి చంపేయండంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా కొంతమేర బతికే ఉంది కాబట్టి తన వాదన వినిపించే అవకాశం వచ్చిందన్నారు.
హైదరాబాద్‌లో తన కేసును వాదించడానికి ఒక్క లాయర్ రాలేదని.. కొందరు పోలీసులు ప్రజల కోసం పనిచేయకుండా తనపై కక్ష కట్టిన వాళ్ల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు శివాజీ. తనను, తన కుటుంబాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చారని.. వారి వల్ల తన పిల్లల చదువులు పాడయ్యాయి అన్నారు. తెలంగాణలో ఇంటర్ వ్యవహారంలో కారకులపై కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
The post నేను త్వరలోనే రాజకీయాలలోకి వస్తున్నా ….! ఒక్కొక్కడికి చుక్కలుచుపిస్తా : శివాజీ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2ZfQIn7
No comments:
Post a Comment