గురువారం ఆయన పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడారు. జిల్లాలో నెలకొన్న కరువు, రైతుల దుస్థితి, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఇంగ్లిషులో ప్రసంగించారు. తీవ్ర కరువుతో కొట్టుమిట్టాడుతున్న అనంతపురం జిల్లా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. మహిళలు ఎంతో గౌరవింపబడుతున్న ఈ దేశంలో తీవ్ర కరువుతో పూటగడవక కొందరు వ్యభిచార గృహాలకు తరలిపోతుండగా…మరికొందరు ఉపాధి కోసం కుటుంబాలను వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితికి కారణం ఎవరని ప్రశ్నించారు..?. ఢిల్లీకి కూత వేటు దూరంలోనే వ్యభిచార గృహాలు నడుస్తున్నాయన్నారు.
మరోవైపు బడికి వెళ్లాల్సిన పసి పిల్లలు రోడ్లుపై తిరుగుతూ కనిపిస్తున్నారన్నారు. నిర్బంధ ఉచిత విద్య చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. లేదంటే పిల్లలు భవిష్యత్తులో జాతికి బరువుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు, టెర్రరిస్టులుగా మారితే ఆరోజు వారిని అదుపు చేసేందుకు రూ.వంద ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. అదే నేడు రూ.10 ఖర్చు చేసి బడిలో చేర్పిస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
వ్యవసాయ సంక్షోభం వ్యభిచారానికి దారి తీస్తోందని హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకరించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. గురువారం లోక్‌సభ జీరోఅవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘మా ప్రాంతంలో వ్యవసాయంపై ఆదాయం వచ్చేదే తక్కువ. వ్యవసాయేతర రంగంలో ప్రస్తుతం పనులు లేవు. దాంతో మహిళలు ఒళ్లు అమ్ముకునే దుస్థితి నెలకొంది. వ్యభిచారకూపంలోకి వెళ్తున్నారు. వ్యవసాయ సంక్షోభం వల్లే వ్యభిచారం, మహిళల అక్రమ రవాణా జరుగుతోంది. నా నియోజకవర్గంలోనే కాదు దేశమంతా ఇలాగే ఉందన్నది కొట్టివేయలేం. ఉపాధికోసం గల్ఫ్ వెళ్తే భారత మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్నది బహిరంగ రహస్యం’ అని పేర్కొన్నారు.
The post పనులు లేక మహిళలు ఏం చేస్తున్నారో తెలుసా …! పార్లమెంట్ లో దుమ్ముడులిపిన ఎంపీ గోరంట్ల మాధవ్. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2KZwYAm
No comments:
Post a Comment