etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, August 19, 2019

మళ్ళి కోనేరులోకి వెళ్ళినా అత్తివరదరాజ స్వామి, మళ్ళి దర్శనంకోసం 40 ఏళ్ళ ఆగాల్సిందే.

40 ఏళ్ళకు ఒకసారి దర్శనమిచ్చే కంచి శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్తి విశేషాలు.. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. దక్షిణాపథం లో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురం(కంచి). కంచిలో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి. 108 దివ్యతిరుపతులలో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. (కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ స్వామి దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది)… ఈ ఆలయ౦లోని విశేషం శ్రీ అత్తి వరదరాజ స్వామి.

తమిళనాడు కంచిలోనీ వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో.. అత్తివరద రాజస్వామి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాక్షాత్తూ ఆ విష్ణుదేవుని స్వరూపమని నమ్మే.. ఈ స్వామి.. ఎప్పుడూ కొలనులోనే శయనిస్తారు. వేఘవతి నది ఒడ్డున కొలువుదీరిన కాంచీపురం క్షేత్రం విశ్వకర్మతో బ్రహ్మదేవుడే స్వామి విగ్రహాన్ని చెక్కించాడని ప్రతీతి. అయితే కేవలం 40 ఏళ్లకు ఓసారి మాత్రమే ఈ స్వామి.. భక్తులకు దర్శనం ఇవ్వడానికి బయటకు వస్తారు. అది కూడా కేవలం 48 రోజులు మాత్రమే. దివ్యమంగళ స్వరూపుడైన స్వామి.. జూలై 1న జలం వీడి జనంలోకి వచ్చారు. ఆగస్టు 17 వరకు భక్తులకు దర్శనమిచ్చారు.

ఆలయ కోనేటి గర్భంలో ఉండే తొమ్మిది అడుగుల అత్తి వరదరాజస్వామివారిని బయటకు తీసుకొచ్చి పవళింపు సేవతో వేడుకలను ప్రారంభించారు. ఈ అనంతపద్మనాభుని దర్శనం.. సర్వపాపహరణం అని భక్తుల నమ్మకం. వేఘవతి నది ఒడ్డున కొలువుదీరిన కాంచీపురం క్షేత్రంలో అడుగుపెట్టడమే పూర్వజన్మ సుకృతంగా చెబుతారు. సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే.. అత్తి వరదరాజస్వామి విగ్రహాన్ని చెక్కించారని.. దీనికి దేవశిల్పి అయిన విశ్వకర్మ సాయపడ్డారని పురాణ కథనాలు చెబుతున్నాయి.

ఈ అపురూపమైన దృశ్యాన్ని చూసేందుకు దేశం నలుమూల నుంచి భక్తులు కంచికి క్యూ కట్టారు. దాదాపు కోటిమంది స్వామి వారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుని ఉంటారని అంచనా. గత 40 ఏళ్లుగా వేయి కళ్లతో ఎదురుచూసిన వారి నిరీక్షణ ఫలించింది. స్వామివారి దర్శనం దక్కింది. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, సెలబ్రెటీలు అందరూ పోటీ పడి మరీ స్వామివారి సేవలో తరించారు. సూపర్ స్టార్ రజనీకాంత్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. 40 ఏళ్లకు ఒకసారి మాత్రమే భక్తుల్ని దర్శనమిచ్చే స్వామి.. జనాన్ని వీడి తిరిగి జలంలోకి వెళ్లారు. మొత్తం 48 రోజుల పాటు దర్శమిచ్చిన స్వామి మళ్లీ 2059లో భక్తులతో పూజలందుకోనున్నారు.

The post మళ్ళి కోనేరులోకి వెళ్ళినా అత్తివరదరాజ స్వామి, మళ్ళి దర్శనంకోసం 40 ఏళ్ళ ఆగాల్సిందే. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2ZbAf6n

No comments:

Post a Comment