ఈ పథకం కింద 1038 పైగా జబ్బులకు ఉచితంగా ఆరోగ్య సేవలు అందించబడుతున్నాయి. ముఖ్యంగా ఈ పథకం ప్రజారోగ్యమే ప్రధాన ఉద్దేశ్యంగా ఉచిత సేవలు అందిస్తూ ప్రజలు చెడు అలవాట్ల వైపు మరలకుండా చెడు అలవాట్ల ద్వారా కొనితెచ్చుకొనే కొన్ని రోగాలకు ఉచిత సేవలను అందించడం లేదు. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీ పథకం జిల్లాలో నేటినుంచి ఆగిపోతోంది. పథకానికి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు సర్కారు చెల్లించకపోవడంతో పథకానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్లులు ఎప్పుడు వస్తాయంటూ.. కొంతకాలంగా ఎదురు చూసిన ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా వారి బిల్లులు మంజూరు కాకపోవటంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు శుక్రవారం నుంచి నిలిచిపోయాయి. 242 ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి.
కాగా ఈ పథకానికి సంబంధించి ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించాల్సిన బిల్లులు సర్కారు చెల్లించకపోవడంతో పథకానికి ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్లులు ఎప్పుడు వస్తాయంటూ.. కొంతకాలంగా ఎదురు చూసిన ప్రైవేట్ ఆసుపత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ విషయాన్ని ప్రైవేట్ ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం ఆధ్వర్యంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా వారి బిల్లులు మంజూరు కాకపోవటంతో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపేయాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రవ్యాప్తంగా 330 ఆస్పత్రులు సేవలు అందిస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్ ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రికే ఆరోగ్యశ్రీ కింద రూ.70 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలుస్తోంది.
ఇప్పటివరకు ఇచ్చిన హామీల్లో ప్రభుత్వం ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదని, ప్రతి సారీ ఫలానా సమయానికి బకాయిలు చెల్లిస్తామని చెప్పడమే తప్ప.. విడుదల చేసింది లేదని ఆస్పత్రుల నిర్వాహాకులు ఆరోపిస్తున్నారు. బకాయిలు విడుదల కాకపోవడంతో ఆరోగ్యశ్రీ సేవలందిస్తున్న కొన్ని చిన్న ఆస్పత్రులు మూతపడ్డాయని చెబుతున్నారు. అద్దెలు, వైద్య సిబ్బంది వేతనాలు చెల్లించడం భారంగా మారుతోందని వాపోతున్నారు. బకాయిలు విడుదలపై సోమవారం(ఆగస్టు 5,2019) వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటలతో పాటు ఆరోగ్యశ్రీ సీఈవోను కలిసి విజ్ఞప్తి చేయాలని నెట్‌వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ నిర్ణయించింది.
The post రాష్ట్ర వ్యాప్తంగా అగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, అల్లాడిపోతున్న నిరుపేదలు. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/308rpnh
No comments:
Post a Comment