జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే 370వ అధికరణను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ సోమవారంనాడు సంచలన ప్రకటన చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా 370 అధికరణ రద్దు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టడం, ఆ కొద్ది సేపటికే రాష్ట్రపతి గెజిట్ విడుదల చేయడంతో ఇకకశ్మీర్‌పై ఇక సర్వాధికారాలు కేంద్రానికే సంక్రమించనున్నాయి. కశ్మీర్ సరిహద్దుల మార్పు, అత్యవసర పరిస్థితిని విధించే అధికారాలు కేంద్రం పరిధిలోకి రానున్నాయి. ఇకపై పార్లమెంట్ చేసే ప్రతి చట్టం జమ్మూకశ్మీర్‌లోనూ అమలు కానుంది.
అయితే ఆర్టికల్ 370 స్వరూపంలో మార్పులు.. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ గురించి రాష్ట్రపతికి ఎప్పుడు చెప్పాలి? ఉపరాష్ట్రపతికి ఎప్పుడు చెప్పాలి? ఎవరెవరికి ఎప్పుడు తెలపాలి? .ఇలా ప్రతి అంశాన్నీ ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారమే చేసుకుపోతోంది! హోం మంత్రి అమిత్ షా సోమవారం పార్లమెంటుకు వచ్చినప్పుడు ఏఎ్‌ఫపీ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోలో ఆయన చేతిలో ఉన్న కాగితంలో కనిపించిన వివరాలే ఇందుకు రుజువు. ఆ కాగితంలో కుడివైపు పై భాగాన అత్యంత రహస్యం (టాప్ సీక్రెట్) అని రాసి ఉంది. కింద.. రాజ్యాంగపరమైన, రాజకీయపరమైన, శాంతిభద్రతలకు చెందిన చర్యల పేరుతో విభజించిన జాబితాలో ఏ పని ఎప్పుడెప్పుడు చెయ్యాలో తేదీలవారీగా ప్రణాళిక ఉంది.
దాని ప్రకారం.. ‘రాజ్యాంగపరమైన’ చర్యల విభాగంలో రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఈ అంశం గురించి తెలిపినట్టు ఉంది. అలాగే.. కేబినెట్ భేటీ నిర్వహణ, రాష్ట్రపతి నోటిఫికేషన్, పార్లమెంటులో బిల్లు ఆమోదం ఐదో తేదీన (అంటే సోమవారం) అని రాసి ఉంది. ఇక ‘రాజకీయపరమైన’ చర్యల విభాగంలో ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించాల్సింది ఆగస్టు 7న అని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ గవర్నర్‌తో, ఇతర రాష్ట్రాల సీఎంలతో దీనిపై మాట్లాడటం వంటివి కూడా అందులో ఉన్నాయి. ఈ నిర్ణయంతో భద్రతా దళాల్లో సైతం హింసాత్మక అవిధేయత ప్రబలే ప్రమాదాన్ని ఊహించి, దానికి తగ్గ కార్యాచరణను రూపొందించడం గురించి ‘శాంతిభద్రతల విభాగం’లో కనిపించడం గమనార్హం.
The post కెమెరా కంటికి చిక్కిన రహస్యలు, ఇంటికి ఆ పేపర్స్ లో ఏముందో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2YsZpOr
No comments:
Post a Comment