etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, August 7, 2019

మీరు చేపలు తింటే ఎన్ని ఆరోగ్యప్రయోజనలున్నాయో తెలుసుకోండి.

చేపలను తినడం వల్ల మనిషి ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. చేప మాంసం సులభంగా జీర్ణం అవుతుంది. చేపలో పుష్కలంగా ఉండే ఒమేగా 3, కొవ్వు, ఆమ్లాలు మానవుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చేప కాలేయ నూనె (ఫిష్‌ లివర్‌ ఆయిల్‌)లో విటమిన్‌ ఎ, విటమిన్‌ డి ఉంటాయి. చేప మాంసంలో కాల్షియం, పాస్పరస్‌, ఫెర్రస్‌, మెగ్నీషియం, జింక్‌ వంటి మినరల్స్‌ లభిస్తాయి. సముద్ర చేపలలో అయొడిన్‌ కూడా లభిస్తుంది. చేపలు తినడం వల్ల మన శరీరంలో అవయువాలకు లబ్ధి చేకూరుతుంది. చేప మాంసంలో ఉండే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు గుండె జబ్బులను నివారిస్తాయి. బిపిని తగ్గిస్తాయి. రక్త నాళాలు మూసుకుపోవడం తగ్గుతుంది. చేపలను ఆహారంగా తీసుకునేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కంటికి మంచిది. ఎముకలు దృఢంగా ఉండేలా చేస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గడం, కొన్ని రకాల క్యాన్సర్లను అదుపులో ఉంచడం, నిద్ర సమస్యలు తగ్గడం, తదితర ఎన్నో ఉపయోగాలు చేపలు తినడం ద్వారా మనకు కలుగుతున్నాయి.

వయస్సు మీద పడడం వల్ల ఎవరికైనా సహజంగానే మతిమరుపు వస్తుంటుంది. కొందరికి ఇది తీవ్రతరమై అల్జీమర్స్‌కు దారి తీస్తుంది. అలాంటి సమస్య ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చని 2016లో పలువురు అమెరికన్ సైంటిస్టులు చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది. చేపలను తినడం వల్ల మెదడు బాగా పనిచేస్తుందట. జ్ఞాపకశక్తి పెరుగుతుందని వారు చెబుతున్నారు. చేపలను బాగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ఓ అధ్యయన వివరాలను ప్రచురించారు. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు రక్తంలో ఉండే ట్రై గ్లిజరైడ్లను తగ్గిస్తాయి. దీంతో రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడకుండా, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.

చేపలను తరచూ తినడం వల్ల వాటిల్లో ఉండే డోపమైన్, సెరొటోనిన్ అనే హార్మోన్లు డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. నిత్యం ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో వెల్లడైంది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. అలాగే పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, పాంక్రియాటిక్ క్యాన్సర్ తదితర క్యాన్సర్లు రాకుండా ఉంటాయని అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌లో ఓ అధ్యయ వివరాలను ప్రచురించారు. స్త్రీలలో రుతు క్రమం సరిగ్గా ఉండాలన్నా.. ఆ సమయంలో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా.. తరచూ చేపలను తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

The post మీరు చేపలు తింటే ఎన్ని ఆరోగ్యప్రయోజనలున్నాయో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2KJTlaP

No comments:

Post a Comment