నగరంలోని పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. సోమవారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో నాటి టీడీపీ ప్రభుత్వం విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ సమీపంలోని మహానేత విగ్రహాన్ని రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించిన సంగతి తెలిసిందే. దీంతో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అదే ప్రాంతంలో మహానేత విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసింది. అలాగే కంట్రోల్ రూమ్ సమీపంలోని ప్రగతి పార్క్‌ను డాక్టర్ వైఎస్సార్ పార్క్‌గా నామకరణం చేశారు. మహానేత విగ్రహం ఏర్పాటుతో నాలుగేళ్ల తర్వాత కంట్రోల్ రూమ్ సెంటర్‌లో మళ్లీ శోభ ఉట్టిపడుతుంది.
పులివెందులలో శ్రీ వైయస్ వివేకానందరెడ్డి గారి విగ్రహావిష్కరణ చేసిన తర్వాత పెద్దిరెడ్డి మరియమ్మగారి స్మారక విగ్రహానికి పుష్పగుచ్చాలు సమర్పించిన సీఎం జగన్. అనంతరం ఆయనను కలవడానికి పసిపిల్లతో వచ్చిన స్థానిక అభిమానులను ప్రేమగా పలకరించిన సందర్భం.
The post మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/30P23eE
via IFTTT

No comments:
Post a Comment