వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నిస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ కార్యకర్తలే షాక్ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారంటూ దుష్ప్రచారానికి తెరలేపిన చంద్రబాబు.. బాధితులు పేరిట గుంటూరులో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ కార్యకర్తలను బాధితుల పేరిట పునరావాస కేంద్రానికి తరలించేందుకు ఆ పార్టీ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే తమను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నట్టు కొందరు టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. పోలీసులు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు తమ స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటికే టీడీపీ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం నుంచి 14 కుటుంబాలు ఆత్మకూరుకు చేరుకున్నాయి. మరో 24 మంది కూడా పిన్నెళ్లి గ్రామానికి తిరిగి వెళ్లిపోయారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు దాడులకు పాల్పడతారంటూ తమ పార్టీ కార్యకర్తలకు పలువురు టీడీపీ నాయకులు భయం కల్పించడంతోనే వారు పునరావాస కేంద్రానికి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే తాము ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడబోమని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసుల సమక్షంలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు తమ అపోహ వీడి తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. టీడీపీ కార్యకర్తల వైఖరితో ఆ పార్టీ అధిష్టానం ఆందోళన చెందుతోంది. పునరావాస కేంద్రం నుంచి తిరిగి ఇంటికి వెళ్లాలని చూస్తున్న మరికొందరని టీడీపీ నాయకులు అక్కడే ఆపివేస్తున్నారు.
The post చంద్రబాబుకు టీడీపీ కార్యకర్తలు షాక్. appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/32w7yPy
via IFTTT
No comments:
Post a Comment