etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, September 10, 2019

నొప్పి అని పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను వాడుతున్నారా ….?అయితే ఈ షాకింగ్ నిజాలు మీకోసమే.

పెయిన్ కిల్లర్లతో గుండె సంబంధ సమస్యల ముప్పు పెరుగుతుందట. ఈ విషయం డానిష్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డైక్లోఫెనాక్ అనేది నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లెమెటరీ డ్రగ్. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పుల నివారణ కోసం దీన్ని ఉపయోగిస్తారు. చాలా దేశాల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందును విక్రయించరు. పారాసిటమాల్ లేదా ఐబ్రూఫెన్ లేదా నాప్రొక్సెన్ లాంటి వాటితో పోలిస్తే.. డైక్లోఫెనాక్ తీసుకునే వారిలో హృదయ సంబంధ సమస్యలు తలెత్తే ముప్పు 20-30 శాతం అధికమని పరిశోధకులు గుర్తించారు. ఈ పెయిన్ కిల్లర్లు తీసుకునే వారిలో హార్ట్ ఎటాక్, ఇతర గుండె జబ్బుల ముప్పు అధికమట. పెయిన్ కిల్లర్లు తీసుకోని వారితో పోలిస్తే డైక్లోఫెనాక్ వేసుకునే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం 50 శాతం అధికమని పరిశోధకులు చెబుతున్నారు.

తక్కువ డోసేజ్ తీసుకున్నప్పటికీ.. ఈ పెయిన్ కిల్లర్ వాడటం ప్రారంభించిన 30 రోజుల నుంచే దాని ప్రభావం గుండె మీద ఉంటోందని పరిశోధకులు తెలిపారు. డైక్లోఫెనాక్ కారణంగా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ బ్లీడింగ్ రిస్క్ కూడా అధికమని తేలింది. కాంబిఫ్లేమ్‌లో పారాసిటమాల్, ఇబుప్రోఫెన్ ఉంటాయి. దీనిని వాడినవారి శరీరంలో ఇది కరగడానికి పట్టే సమయాన్నిబట్టి వీటి ప్రమాణాలను నిర్ధారిస్తారు. ఈ ట్యాబ్లెట్లను ఫ్రెంచ్ కంపెనీ సనోఫీ ఉత్పత్తి చేస్తోంది. సీడీఎస్‌సీఓ నివేదిక పర్యవసానంగా భారతదేశంలోని సనోఫీ స్థానిక విభాగం ఈ ట్యాబ్లెట్లను భారీగా వెనక్కు రప్పిస్తోంది. మన దేశంలో సనోఫీ విక్రయిస్తున్న ఐదు అతి పెద్ద బ్రాండ్లలో కాంబిఫ్లేమ్ ఒకటి.

The post నొప్పి అని పెయిన్ కిల్లర్ టాబ్లెట్లను వాడుతున్నారా ….?అయితే ఈ షాకింగ్ నిజాలు మీకోసమే. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2UJzfC0

No comments:

Post a Comment