ఉల్లిపాయ కరోలస్ లిన్నేయస్ ద్వినామీకరణ ప్రకారం ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది.ఆలియేసి కుటుంబంలో ఆలియమ్ ప్రజాతికి చెందినది. సాధారణ నామము ఉల్లిపాయ. సాధారణం వంటకాలలో వినియోగించే ఉల్లిపాయ శాస్త్రీయ నామము ఆలియమ్ సీపా. వెల్లుల్లి కూడా ఇదే ప్రజాతికి చెందినది. ఉల్లిపాయను సంస్కృతంలో పలాండు అని, హిందీలో ప్యాజ్ అని, ఇంగ్లీషులో ఆనియన్ అని అంటారు. తెలుగులో దీనిని ఉల్లిపాయ లేదా ఉల్లిగడ్డ అంటాము. నిజానికి దీనిని నీరుల్లిపాయ అనడం సరైనది. నీటి వసతి ఉన్న ప్రదేశాలన్నింటిలోనూ, వర్ష రుతువులోనూ దీనిని సాగు చేస్తారు. దీనికి విత్తనాలుగా దుంపలను, గింజలను కూడా వాడవచ్చు. దీని ఆకులు సన్నగా, పొడవుగా ఉంటాయి. ఆకుల మధ్యలో ఒక కాండం ఉండి, దాని చివర పూలగుత్తి ఏర్పడుతుంది. అందులోనే గింజలు ఏర్పడుతాయి. ప్రతి మొక్కకు భూమిలో ఒకటినుంచి మూడు వరకూ దుంపలు ఏర్పడుతాయి. ఉల్లి చేసే మేలు తల్లి కుడా చేయదనే సామెత ఉన్నది .
1. ఎప్పుడైన మన పెద్దవారు మనం బయటికి వెల్లే సమయంలో ఒక ఉల్లిని వెంట తీసుకుపొమ్మంటారు దానికి కారణం ఉల్లి మన శరీరానికి చల్లధనం ఇస్తుంది.
2. తెల్ల ఉల్లిపాయలను చిన్నగా తరిగి నీళ్లలోవేసి మరిగించి తాగుతూ ఉంటే మూత్రంలో మంట తగ్గుతుంది.
3. ఉల్లిపాయలను గుజ్జుగా దంచి 3 టేబుల్ స్పూన్ల వెనిగర్‌కు కలిపి తింటే ఆమాశయం, జీర్ణ అవయవాలు శక్తివంతం అవుతాయి.
4. చిటికెడు నల్ల ఉప్పు పొడిని కలిపి రోజుకు అవసరాన్నిబట్టి రెండూ లేదా మూడుసార్లు చప్పరించి మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బరింపు, పొట్ట నొప్పి, గ్యాస్ తగ్గుతాయి.
5. ఉల్లిపాయ రసాన్ని, సున్నం నీళ్లను కలిపి పూటకు రెండు టీస్పూన్ల వంతున తాగితే కలరాలో నీళ్ల విరేచనాలు, వాంతులు అదుపులోకి వస్తాయి.
6. పచ్చి ఉల్లిపాయను రోజువారీగా తీసుకుంటూ ఉంటే మహిళల్లో ఋతుక్రమం సక్రమంగా ఉంటుంది.
7. పచ్చి ఉల్లిపాయను పురుషులు తీసుకుంటే వీర్యకణాలు అభివృద్ది చెందుతాయి.
8. రక్తపోటు , గుండె జబ్బులు , ఆస్తమా , అల్లెర్జి , ఇన్ఫెక్షన్ , దగ్గు , జలుబు , నిద్రలేమి , ఉబకాయము వంటి జబ్బులు రాకుండ చేస్తుంది.
9. కాలిన గాయాలపై పచ్చి ఉల్లిపాయను మర్దనా చేసినట్టు రాయాలి. దీంతో ఆ ప్రదేశంలో ఏర్పడే మంట, నొప్పి తగ్గుతాయి. అంతేకాదు ఇన్‌ఫెక్షన్లు కూడా దరిచేరవు.
The post ఉల్లిపాయ తింటే అన్నిరకాల ఆరోగ్యప్రయోజన్నాయో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/32DeF9a
No comments:
Post a Comment