etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, September 8, 2019

వెన్నునొప్పి ఎందుకు వస్తుందో కారణం తెలిసింది, దానికి సింపుల్ టిప్స్ ఇదే.

వెన్నునొప్పి అనేది వీపులో వచ్చే నొప్పి. ఇది సాధారణంగా కండరాల నుండి కాని, నరాల నుండి కాని, ఎముకల నుండి కాని, కీళ్ళ నుండి కానీ, వెన్నుపాములోని ఇతర నిర్మాణాల నుండి కాని పుడుతుంది. ఈ నొప్పిని తరచుగా మెడనొప్పి, వెన్ను పై భాగపు నొప్పి, వెన్ను దిగువ భాగపు నొప్పి, హలాస్థి నొప్పిగా విభజిస్తుంటారు. ఇది ఆకస్మికంగా గానీ, ఎడతెగని నొప్పిగా గానీ ఉండొచ్చు. స్థిరంగా కానీ, విడతలు విడతలుగా వస్తూ పోతూ కానీ, ఒకే చోట కానీ, అనేక ప్రదేశాలకు విస్తరిస్తూ కానీ ఉండొచ్చు. అది కొద్ది పాటి నొప్పిగా కానీ, పదునుగా, చీల్చుక పోతున్నట్టుగా కానీ, మంటతో కానీ ఉండొచ్చు. మోచేతి లోకి, చేతి లోకి, వెన్ను పై భాగానికి, వెన్ను దిగువ భాగానికి కానీ నొప్పి వ్యాపించవచ్చు (కాలు, లేదా పాదంలోకి వ్యాపించవచ్చు). నొప్పితో సంబంధం లేని బలహీనత, మైకము, తిమ్మిరి కనిపించవచ్చు.

మనలో సగటున ప్రతి ఇద్దరిలో ఒకరు వెన్నునొప్పి సమస్యతో భాద పడుతూ ఉండటం చూస్తూ ఉంటాం. అసలు వెన్నునొప్పి ఎందుకు వస్తుంది అనే ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా ఎవరు చెప్పేవారు కాదు. ఎంతో మందిని వేధిస్తున్న ఈ సమస్యకు గుంటూరు వైద్య నిపుణులు కారణాలు కనుక్కున్నారు. వెన్నుపూసలోని డిస్కులకు రక్త ప్రసరణ తగ్గి… అక్కడ ఉండే ఏన్యులస్ ఫిబిరోసిస్ (వలయాకారంలో ఉండే మెత్తటి పొర) క్షీణించి వెన్నునొప్పి వస్తుందని గుర్తించినట్లు తెలిపారు. అతిగా బరువులు ఎత్తటం, ధూమపానం వంటి పలు కారణాలతో కూడా ఈ పొర దెబ్బ తింటున్నట్లు వివరించారు. రక్త ప్రసరణ పెంచితే డిస్కులు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పారు.

The post వెన్నునొప్పి ఎందుకు వస్తుందో కారణం తెలిసింది, దానికి సింపుల్ టిప్స్ ఇదే. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2PXwwGa

No comments:

Post a Comment