etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, September 9, 2019

తుమ్మటం అశుభమా? తుమ్మితే ఏమవుతుందో తెలుసా …?

తుమ్ము అనేది సాధారణంగా అనునాసిక మ్యూకస్‌లో అన్యపదార్ధ కణాల ప్రకోపం కారణంగా ఏర్పడిన గాలిని ఊపిరితిత్తుల నుండి ముక్కు మరియు నోటి ద్వారా తొలిగించే ఒక అర్ధ-స్వతంత్ర కంపనం. హఠాత్తుగా కాంతిమంతమైన వెలుగుకు గురైనప్పుడు, ప్రత్యేకంగా కడుపునిండుగా ఉన్నప్పుడు లేదా సూక్ష్మక్రిమి సంక్రమణం జరిగినప్పుడు తుమ్మటం జరుగుతుంది మరియు ఇది వ్యాధులు వ్యాప్తి చెందడానికి దారితీస్తుంది. ఎవరైనా తుమ్మినప్పుడు ఆ సమయంలో బయటికి వెళ్ళాల్సిన వారు ఆగి పోతారు. ఆ సమయంలో ఏదైనా ఆలోచన చేస్తూ ఉంటే దానిని వాయిదా వేస్తారు. మరి కొందరు ఏదైనా మాట్లాడుతున్నపుడు పక్క వారు తుమ్మితే ఆ మాట సత్యం అని అంటారు. నిజానికి తుమ్ము శుభమా? అశుభమా? అసలు తుమ్ములు ఎందుకు వస్తాయి?

తుమ్మిన సమయంలో మన గుండె తాత్కాలికంగా కొట్టుకోవటం ఆగుతుంది. తుమ్ము అనేది నాసికా రంధ్రాలలో ఏదైనా అడ్డు పడినప్పుడు వెంటనే ఊపిరితిత్తుల నుండి ముక్కు మరియు నోటి ద్వారా తొలగించే ప్రక్రియ. హఠాత్తుగా కాంతివంతమైన వెలుగుకు గురైనపుడు, ప్రత్యేకంగా కడుపు నిండుగా ఉన్నప్పుడు లేదా సూక్ష్మక్రిమి సంక్రమణం జరిగినప్పుడు తుమ్ము రావటం జరుగుతుంది. తుమ్మడం వల్ల దాదాపు నలబైవేల సూక్ష్మ జీవులు సెకనుకి వంద మైళ్ళ వేగంతో గాలిలోకి విసరబడతాయి. అందువల్ల ఆ సమయంలో చుట్టూ ఉన్నవారు కాస్త ఇబ్బందికి లోనౌతారు. మరి దీనిని అశుభ కారణంగా ఎందుకు భావిస్తారు అంటే?

బృహస్పతి శకున ప్రకరణలో మరియు గర్గుని సూత్రాలలోనూ తుమ్ము అశుభం అని చెప్పబడింది. అయితే వీటి ప్రకారం “ఆరోగ్య వంతుని తుమ్ము మాత్రమే అశుభం అని పరిగణించాలి” అని అందులో ప్రస్తావించారు. ఆరోగ్య వంతుడు అకాలంలో తుమ్ముతున్నాడు అంటే అక్కడి వాతావరణంలో ఏదైనా అనారోగ్యకరమైన మార్పు జరిగిందని అర్ధం. అందుకని ఏదైనా శుభ కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు ఎవరైనా తుమ్మితే అశుభం అని అనుకుంటారు. ఆ క్షణం గుండె కొట్టుకోవటం ఆగటం వల్ల దాదాపుగా మరణం సంభవించినట్లుగా భావించి “చిరంజీవ..! చిరంజీవ..!”, “శ్రీ రామ రక్ష” మరియు ” దీర్ఘాయురస్తు” అని అంటారు.

The post తుమ్మటం అశుభమా? తుమ్మితే ఏమవుతుందో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2Lm1Yd0

No comments:

Post a Comment