ఉల్లి చేసే మేలు తల్లి కూడా చెయ్యలేదు అంటూ వెల్లుల్లిని కొనియాడని వారు లేరు. ప్లేగుతో పోరాడేది, తిష్టని బ్రష్టు పట్టించేది, కొవ్వుని కరిగించేది, పరాన్నభుక్కులని పరిగెట్టించేది, కోలెస్టరాల్‌ని కత్తిరించేది, కేన్‌సరు రాకుండా కాపాడేది, రక్తపు పోటుకి పోట్లు పొడిచేది, వీర్యాన్ని వృద్ధి చేసేది, దోమలని తరిమికొట్టేది, తామరని తగ్గించేది, జీర్ణశక్తిని పెంచేది, రక్షక శక్తిని రక్షించేది, ఇలా వెల్లుల్లి సుగుణాలని గుక్క తిప్పుకోకుండా ఎంతసేపయినా చెప్పుకోవచ్చు, వెల్లుల్లి సూక్ష్మజీవులను అతి సూక్ష్మజీవులను కూడా సంహరిస్తుంది. గాయాలకు చీము పట్టకుండా చేస్తుంది. చర్మవ్యాధులను, సుఖవ్యాధులను కూడా నయం చేస్తుంది. రక్తంలో కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండెపోటు ప్రమాదాన్ని, మెదడులో రక్తస్రావ, రక్తపోటు ప్రమాదాలను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిలో ఇన్సులిన్ అవసరాన్ని తగ్గిస్తుంది. జీర్ణవాహికలో అన్నిరకాల హానికర సూక్ష్మజీవులను నిర్మూలిస్తుంది.
చైనాలో టీబీ చికిత్సలో కూడా వెల్లుల్లిని ప్రధాన ఔషధంగా వాడిన దాఖలాలున్నాయి. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల నాటి వైద్య గ్రంథాల్లోనూ వెల్లుల్లి ప్రస్తావన ఉంది. మొదటి ప్రపంచయుద్ధంలో బ్రిటిష్, రష్యా సైనికులు యుద్ధంలో క్షతగాత్రుల చికిత్స కోసం యాంటిబయోటిక్‌గా వెల్లుల్లిని వివరీతంగా వాడారు.
The post వెల్లుల్లి తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Xfba7l
No comments:
Post a Comment