అల్లం ఒక చిన్న మొక్క వేరునుండి తయారవుతుంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఇది భారతదేశం మరియు చైనా దేశాలలో చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని శతాబ్దాల నుంచీ చైనీయుల వైద్యంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తోంది. కన్ఫ్యూషియస్ తన రచనల్లో దీనిగురించి ప్రస్తావించాడు. ఆసియా దేశాల్లో చేసే చాలా వంటకాల్లో ఇది విడదీయలేని భాగం. పచ్చళ్ళలోనూ, కూరల్లో వేసే మసాలా లోనూ దీన్ని విస్తృతంగా వాడుతారు. ఎండాకాలంలో వడకొట్టకుండా, అల్లాన్ని కరివేపాకు, మజ్జిగలతో కలిపి తీసుకుంటారు. చాలామందికి ప్రయాణాల్లో వాంతులు మహా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే సాధారణంగా మనం రోజు వంటల్లో అల్లం వాడుతూ ఉంటాం.అల్లం వంటలకు రుచినిచ్చే పదార్థంగానే కాక ఇది మనకు కలిగే అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది.
ఈ క్రమంలోనే నిత్యం ఉదయాన్నే పరగడుపునే ఒకటి రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం రసం రోజు పరగడుపునే త్రాగడం వలన వయస్సు మీద పడడం కారణంగా వచ్చే మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిత్యం అల్లం రసం సేవించడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి (హెచ్‌డీఎల్) కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీంతో గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. చాలా మందికి ఉదయం నిద్రలేవగానే లేదంటే రోజులో ఇతర సందర్భాల్లోనూ వికారంగా ఉంటుంది. దీన్ని నివారించాలంటే ఉదయాన్నే పరగడుపున అల్లం రసం తాగాలి. దీంతో ఫలితం ఉంటుంది.
The post మీరు రోజు పొద్దున్నే అల్లం రసం త్రాగితే ఎన్ని లాభాలున్నాయో తెలుసా ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2DdU8xg
No comments:
Post a Comment