దాదాపు ప్రతి దేశంలోనూ టీ వినియోగంలో ఉన్నా భారతదేశం ఉత్పాదించే టీ వైవిధ్యానికీ, విశిష్టతకూ ప్రసిద్ధి పొందింది. పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ టీ మిక్కిలి నాణ్యమైనది. ఇది సువాసనభరితమైనది. ముఖ్యంగా ఇక్కడి మంచుతో కూడిన హిమాలయ పర్వత వాతావరణ పరిస్థితుల వల్ల మరియు ఈ ప్రదేశంలో భూసార రచనా విధానం వల్ల ఇక్కడ ఉత్పత్తి కాబడే టీకి ప్రత్యేక రుచి, సువాసన సిద్ధిస్తుంది. భారతదేశంలో తేయాకు సాగు ప్రాతిపదికగా అనేక మందికి జీవనోపాధి కలుగుతోంది. ఈ రంగంలో సుమారు 20 లక్షల మంది ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ శ్రామికులు ఉన్నారు. వీరిలో 50 శాతం స్త్రీలు. అయితే చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం అలవాటు.
ఒక్కపూట టీ తాగకపోతే ఏదో వెలితిగా ,తలనొప్పిగా వుంటుంది.సాయంత్రం పూటా డీ లా పడినట్లు అనిపిస్తే..టీ పడితే చాలు మళ్ళీ రీ చార్జ్ అయిపోతాము . .అయితే మనం త్రాగే చాయలోను రకరకాల వెరైటీ లు అందుబాటులోకి వచ్చాయి ఇప్పుడు.ఉపశమనానికి ,ఉల్లాసానికి కారణమయ్యే టీ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్లు కూడా వున్నాయి.అవేంటో తెలుసుకుందాం. తేనేటి లో వుండే కెఫీన్ మెదడును చురుగ్గా ఉంచుతుంది.కానీ అధిక మోతాదులో టీ త్రాగేస్తే…నిద్ర సరిగ్గా పట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి . టీ లోని థీయోఫైలిన్ అనే రసాయనం డీహైడ్రేషన్ కు కారణం అవుతుంది .
ఇది మలబద్దకానికి దారి తీస్తుంది .ఉదయాన్నే టీ త్రాగడం వలన విరేచనం సాఫీ గా అవుతుందని చాలా మంది నమ్ముతారు.కానీ అధిక మోతాదులో టీ త్రాగితే మలబద్దకం వస్తుంది.కెఫీన్ మూడును మర్చేస్తుందనేసంగతి తెలిసిందే కదా కానీ కెఫీన్ మోతాదు పెరిగితే నిద్ర పట్టక పోవడం,విశ్రాంతి లేకపోవడం,హృదయ స్పందనల రేటు పెరగడంలాంటి సమస్యలు తలెత్తుతా యి .గర్బం దాల్చిన వారు టీ మనేయ్యడమే ఉత్తమం.పిండం ఎదుగుదలకు కెఫీన్ హనీ కలిగించే అవకాశం వుంది .అదే జరిగితే అబార్షన్ అవుతుంది..
The post టీ ఎక్కువగా త్రాగుతున్నారా ? అయితే ఈ నష్టాలు తప్పవు, ఎందుకంటే ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2XVX376
No comments:
Post a Comment