నెయ్యి పెరుగు నుండి లభించే ఒక నూనె లాంటి కొవ్వు పదార్థం. దీనిని వంట లలో, పూజ కార్యక్రమాలలో, కొన్ని ఆహార పదార్థాలుగా ఎక్కువగా వాడుతారు. వెన్న ను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. అయితే ఉదయం నిద్రలేవగానే చాలమందికి కాఫీ కానీ టీ కాని తాగుతుంటారు. మరికొంతమందికి అయితే బ్రేక్ ఫాస్ట్ తింటుంటారు. అయితే ఉదయాన్నే పరగడుపున వేడినీటిలో నెయ్యిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాల మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రేక్ ఫాస్ట్ కంటే ముందు పరగడుపునే నెయ్యిని తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
1. ఆవు నెయ్యి తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.
2. క్యాన్సర్ కణాలను నాశనం చేసే గుణాలు నెయ్యిలో ఉంటాయి. దీంతో రోజూ నెయ్యి తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
3. కంటి సంబంధిత వ్యాధితో భాధపడే వారు నెయ్యి ని ఆహారంతో పాటు తీసుకుంటే ఆ సమస్యల నుండి బయటపడవచ్చు.ఎందుకంటే ఇందులో మిటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది.
4. నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనే భావన చాలా మందిలో ఉంది.అయితే నిజానికి నెయ్యి చెడు కొలెస్ట్రాల్ పెంచదు..మంచి కొలెస్ట్రాల్ ను మాత్రమే పెంచుతుంది.దీంతో గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
5. ఉదయం పూట ఏమి తీసుకోకుండా ఆవు నెయ్యిని తాగడం వల్ల మెదడు యాక్టివ్‌గా మారుతుంది. మెదడుకు కావల్సిన శక్తి అంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
6. గర్భిణిలైతే నెయ్యిని ప్రతి రోజు తీసుకోవాలంటున్నారు వైద్యులు .ఎందుకంటే ఎదిగే పిండానికి కీలక పోషకాలు అందాలంటే నెయ్యి తప్పనిసరి.
7. నెయ్యి తీసుకోవడం వల్ల మొఖంపై వున్నా మచ్చలు,ముడుతలు,మొటిమలు పోతాయి.అంతే కాదు నెయ్యి ని రోజు తింటుంటే మొఖం కాంతి వంతంగా మారుతుంది.
8. ఆవు నెయ్యిని రోజూ తాగితే కీళ్లలో లూబ్రికేషన్ అవుతుంది. దీని ఫలితంగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
The post నెయ్యి రోజు ఉదయాన్నే తింటే ఎన్ని లాభాలున్నాయో తెలుసా …? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2qMFDho
No comments:
Post a Comment