మన దేశ సంస్కృతిలో పామును మనం దేవుడిలా పూజిస్తాం..శివుడంతటి వాడే పామును మెడలో ఆభరణంగా ధరించాడు..జీవ పరిణామ ప్రక్రియలో మానవ జన్మకు సంబందించిన అడుగుల్లో పాము జన్మ చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది..అందుకే మీరు ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాముల ప్రతిరూపాలు విగ్రహాలుగా చెక్కబడి ఉంటాయి..అందరికీ తెలిసినంత వరకూ పాము ప్రతిరూపం లేని గుడి అంటూ ఉండదు..ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది..అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములున్నాయి..మీరు ఏ దేవాలయాన్ని సందర్సించినా అక్కడ పాముల ప్రతిరూపాల కోసం ప్రత్యెక స్థలం ఉంటుంది.
ఎందుకంటే అది జీవపరిణామ ప్రక్రియలో చాలా ముఖ్యమైన మలుపు..ఎన్నో విధాలుగా జీవ ప్రేరణకు కారణం కూడా అదే..గుడిలో మనం పాము విగ్రహాలను చూస్తుంటాం..మరి అప్పుడప్పుడు గుడిలోపలికి పాములు వస్తుంటాయి కూడా..మరి నిత్యం గుడి లోపలే పాము ఉంటే…ఎవరైనా పాము ను చూసి ఆమడ దూరం పారిపోతుంటారు…కానీ ఈ గుడిలో పాము కు నిత్యం పూజలు చేస్తారు..పాము అంటే చిన్నది కాదు..6 కాదు 7 కాదు..ఏకంగా 19 అడుగుల పాము..దీనికి నిత్య పూజలు జరుగుతాయి..ఈ పూజ జరిపించుకుంటున్న పాము 19 అడుగుల కోబ్రా..ఇది గుడి ఆస్థాన పాము..
ఈ గుడి మలేషియా లో ఉన్నప్పటికీ చేసే పూజలు మాత్రం మన స్వచ్చమైన తమిళ సాంప్రదాయంలో..దేవుడికి ఎలా అయితే ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారో, ఇక్కడ ఆ పాముకు కూడా దేవుడి విగ్రహాల పక్కనే పెట్టి పూజిస్తారు.గంట పాటు జరిగే ఈ పూజలో ఆ పాము అదరకుండా, బెదరకుండా పూజలు అందుకుంటుంది..ఈ పాము ఎన్నేళ్ళ నుంచి ఉంది..ఎలా వచ్చ్చిందన్న విషయం తెలియదు..ఈ పామును సాక్షాత్తూ ఆ శివుడే పంపించాడని తలచి పూజలు నిర్వహిస్తారు..
The post ఎన్నో సంవత్సరాలుగా ఆ గుడికి కాపలాగా ఉన్న 19 అడుగుల నాగుపాము! ఆ గుడి ఎక్కడా ఉందొ తెలుసా …! appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/long-years-in-19feet-sneck/


No comments:
Post a Comment