పైనాపిల్ ఒక రకమైన పండ్ల చెట్టు. ఇది మామూలు చెట్ల మాదిరిగా కాక భూమి నుండి పెద్దగా విడివడిన పచ్చని కలువ మాదిగా ఉండును. దీని ఆకులు పొడవుగా ముళ్ళతో సున్నితంగా ఉండును. ఇది దక్షిణ అమెరికాలో పుట్టింది. అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తం అన్ని దేశాలలో పెరుగుతుంది. దీని ఉత్పత్తిలో హవాయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నది. ప్రస్తుతం ప్రపం వ్యాప్తంగా పైనాపిల్ ఉత్పత్తిలో 60% వాటా హవాయిదే. అమెరికన్ ఆదివాసులు ఈ పండు అంటే బాగా ఇష్ట పడతారు. వారు దీన్ని దేవతాఫలంగా భావిస్తారు.
1. పైనాపిల్ తింటే పచ్చ కామెర్లు నయమవుతాయి.
2. పైనాపిల్ ముక్కలుగా గానీ, జ్యూస్‌గా గానీ తీసుకుంటే మూత్ర పిండాలలోని రాళ్లు కరుగుతాయి.
3. ఒళ్లు నొప్పులు, నడుము నొప్పి వంటి వాటిని ఇది తగ్గిస్తుంది.
4. దీన్ని తింటే కంటి చూపు మెరుగౌతుంది.
5. ఆకలి లేదని అన్నం తినడానికి మారాం చేసే పిల్లలకు ఈ పండు రసం పట్టిస్తే ఆకలి బాగా పెరుగుతుంది.
6. పైనాపిల్ వలన శారీరక ఎదుగుదల, ఎముకల పటుత్వం మెరుగవుతాయి.
7. పైనాపిల్ ఆకుల రసం కడుపులోని పురుగులను నాశనం చేస్తుంది.
8. ఈ ఆకులరసంలో ఒక చెంచా తేనె కలిపి తాగితే విరోచనం అయ్యి కడుపులోని పురుగులు బయటపడతాయి.
9. ఈ పండు ముక్కలను తేనెలో కలిపి తింటే శారీరక శక్తి పెరుగుతుంది.
10. శరీరం నిగారింపుతో ఉంటుంది. కడుపు నిండుగా ఆహారాన్ని తీసుకున్న తర్వాత ఒక చిన్న పైనాపిల్ ముక్క తింటే చాలు తేలిగ్గా జీర్ణమౌతుంది.
The post పైనాపిల్ తో ఇలా చేస్తే అందం,ఆరోగ్యం మీ సొంతం, ఎలానో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/32Qt7u6
No comments:
Post a Comment