సీఈవో రజత్ కుమార్ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీలకు పలు సూచనలు చేశారు. ఈనెల 25న ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు లోక్‌సభ ఎన్నికల కోసం 58 నామినేషన్లు దాఖలయినట్లు రజత్ కుమార్ తెలిపారు. సీవిజిల్ యాప్‌లో ఇప్పటి వరకు 328 ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందులో 3 పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఎక్కువగా 75 ఫిర్యాదులు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చాయన్నారు. ఎన్నికల నిబంధనావళిని అన్ని రాజకీయ పార్టీలకు వివరించామని రజత్ కుమార్ వెల్లడించారు.
ఈసందర్భంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన కొన్ని సూచనలను రజత్ కుమార్ చెబుతూ.. ప్లాస్టిక్, పాలిథిన్, నాన్ బయోడీగ్రేడబుల్ మెటీరియల్‌ను ప్రచారం కోసం పార్టీలు ఉపయోగించరాదన్నారు. బయో డీగ్రేడబుల్ మెటీరియల్, పర్యావరణహితమైన వాటినే ప్రచారాల్లో వాడాలని సూచించారు. ఉదాహరణకు బయోడీగ్రేడబుల్ మెటీరియల్స్ అయినటువంటి పేపర్‌ను ప్రచారం కోసం వినియోగించుకోవచ్చన్నారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ప్రచారం చేసే అభ్యర్థులు లౌడ్ స్పీకర్ వాడకూడదని తెలిపారు.
The post 25న ఓటరు జాబితా విడుదల చేస్తాం: సీఈవో రజత్ కుమార్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2TjwsgA
No comments:
Post a Comment