నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఈ నెల 13న ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అమరావతికి రానున్న రాజీవ్ కుమార్ ఎటువంటి పెట్టుబడి అవసరం లేని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను (జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్) పరిశీలించనున్నారు. మంత్రివర్గ సమావేశంలో భాగంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నవయుగకు పోలవరం హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రివర్స్ టెండరింగ్ పద్ధతిలో తాజా టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాంట్రాక్టర్‌కు ఇచ్చిన అడ్వాన్స్‌ల రికవరీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
అదేవిధంగా ఆశావర్కర్ల వేతనాల పెంపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇక నుంచి ఆశా వర్కర్ల వేతనాలు రూ.3వేల నుంచి రూ.10వేలకు పెరగనున్నాయి. మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ భూముల లీజు కూడా చెల్లించలేదని పరిశ్రమల శాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు. ఇదే సమయంలో మావోయిస్టులపై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
The post సిఎం జగన్ ని కలవనున్న నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar https://ift.tt/2UvBgBq
via IFTTT
No comments:
Post a Comment