తవ్వకాల్లో భాగంగా పురాతత్వవేత్తలకు 2,500 సంవత్సరాల నాటి గుడ్లు బయటపడ్డాయి. చైనాలోని షాంజింగ్ అనే నగరంలోని ఓ స్మశానంలో ఈ గుడ్లను పురాతత్వవేత్తలు గుర్తించారు. ఓ వ్యక్తి సమాధిలో ఈ గుడ్లు దొరికినట్టు పురాతత్వవేత్తలు తెలిపారు. పాతిపెట్టి వేల సంవత్సరాలు కావడంతో కేవలం పెంకులు మాత్రమే మిగిలినట్టు వారు చెప్పారు. గుడ్లుతో పాటుగా ప్లేట్లు, ఇతర వంటింటి సామాగ్రి కూడా గుర్తించినట్టు తెలిపారు. చనిపోయిన వ్యక్తిపై ప్రేమతో వారి కుటుంబసభ్యులు ఈ పని చేసినట్టు వారు చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తిని పాతిపెట్టే సమయంలో ఆయన కుటుంబసభ్యులు సమాధిలో తినడానికి వివిధ రకాల ఆహారాన్ని సమాధిలో పూడ్చినట్టు పురాతత్వవేత్తలు గుర్తించారు. కాగా, స్మశానంలో వేల సంవత్సరాల నాటి 38 సమాధులను తాము మొత్తంగా గుర్తించినట్టు, ఒక్కో సమాధిని ఒక్కో ప్రత్యేక ఛాంబర్‌లో పూడ్చినట్టు పురాతత్వవేత్తలు చెప్పారు.
The post తవ్వకాల్లో బయటపడ్డ 2,500 సంవత్సరాల నాటి గుడ్లు.. ఎందుకు పాతిపెట్టారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FHHA21
No comments:
Post a Comment