ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన 2వ ఓవర్ ఆఖరి బంతికి రాయుడు(1) బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత స్టోక్స్ వేసిన 4వ ఓవర్ నాలుగో బంతికి వాట్సన్(13) జోఫ్రాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక ధవల్ కులకర్ణీ వేసిన 5వ ఓవర్ ఐదో బంతికి కేదార్(8) బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి డ్రెస్సింగ్ రూం బాటపట్టాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీ తొలి బంతికే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
జోఫ్రా ఆర్చర్ వేసిన 6వ ఓవర్ మూడో బంతి.. ధోనీ బ్యాట్‌కు ఇన్‌సైడ్ ఎడ్జ్ తీసుకొని వికెట్లకు తగిలింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు సంబరాలు ప్రారంభించారు. కానీ బెయిల్స్ మాత్రం కిందపడకపోవడంతో అది నాటౌట్ అయింది. దీంతో ప్రస్తుతం ధోనీ నిలకడగా ఆడుతూ.. జట్టుకు భారీ స్కోర్ అందించేందుకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం 14 ఓవర్లు ముగిసేసరికి చెన్నై 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజ్‌లో ధోనీ(28), బ్రావో(0) ఉన్నారు.
వీడియో కోసం ఇక్కడి క్లిక్ చెయ్యండి
The post ధోనీ ఎఫెక్ట్.. కిందపడేందుకు నిరాకరించిన బెయిల్స్, వైరల్ వీడియో appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2WycDUE
No comments:
Post a Comment