ఓటరు జాబితాలో నమోదయ్యేందుకు ఇంకా ఐదు రోజులే సమయం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఆయన సూచించారు. ఓటరు కార్డున్న వారు కూడా తమ ఓటు ఉందో లేదో చెక్ చేసుకుని.. లేని పక్షంలో వెంటనే ఫామ్-6 దరఖాస్తు చేయాలని పిలుపునిచ్చారు. ఫామ్-6ను ఆన్‌లైన్‌లో గానీ, ఎన్‌వీఎ్‌సపీ వెబ్‌సైట్ ద్వారా గానీ, ఎలక్షన్ కమిషన్ (ఈసీ) యాప్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పారు. కోడ్ అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. సోమవారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమవుతామని చెప్పారు.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఇకపై ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు ఈసీ ఆదేశాలు కావాలని చెప్పారు. తమ వద్ద ఇంకా 1.5 లక్షల ఫామ్-7 దరఖాస్తుల పరిశీలన పెండింగ్ ఉందని చెప్పారు. రెండు మూడు రోజుల్లో వీటి పరిశీలన పూర్తి చేసి ఎన్ని ఓట్లు తొలగించాలో నిర్ణయిస్తామన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే ఆ ఓట్లను జాబితా నుంచి తొలగిస్తామని లేనిపక్షంలో పోలింగ్ డే రోజున పోలింగ్ బూత్‌లకు పంపే జాబితాలో ఆ పేర్లను ప్రత్యేకంగా మార్క్ చేసి పంపిస్తామని చెప్పారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు దరఖాస్తుల స్వీకరణకు మార్చి 15 ఆఖరి తేదీ అని చెప్పారు. ఒక్కో దరఖాస్తు క్షేత్రస్థాయి విచారణ కోసం 3 రోజులు పడుతుందని, విచారణ తర్వాత వారికి 7 రోజుల ముం దు నోటీసు పంపుతామని చెప్పా రు. మార్చి 25 నామినేషన్లకు చివరి తేదీ కావడంతో దానికి 10 రోజుల ముందు మాత్రమే ఫామ్-6లు స్వీకరిస్తామని చెప్పారు. నామినేషన్లకు చివరిరోజైన మార్చి 25 తర్వాత సప్లిమెంట్స్‌తో కూడిన తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. ఆ తర్వాత జాబితాలో ఎలాంటి మార్పులు చేర్పులు కుదరవన్నారు. మార్చి 18 నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చన్నారు. ఆదివారం నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ మే 25 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
పోలింగ్ బూత్‌ల వద్ద టోకెన్ సిస్టమ్‌ను వివాదరహితంగా అమలు చేయడంపై ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. కొత్త ఓటర్లందరికీ ఎపిక్ కార్డులు జారీ చేస్తామన్నారు. 20 లక్షల ఎపిక్ కార్డుల ప్రింటింగ్ చివరి దశలో ఉందన్నారు. వారం రోజుల్లో వీటిని జారీ చేస్తామన్నారు. ఎన్నికల రోజు ఈవీఎం, వీవీప్యాట్‌ల పనితీరులో లోపాలు తలెత్తితే తక్షణమే వాటిని మార్చి కొత్తవాటిని పెడతామని చెప్పారు. ఆ సమస్యను సాయంత్రం వరకు గుర్తించలేకపోతే రీపోలింగ్‌కి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఈవీఎంలు పూర్తిస్థాయిలో రాష్ట్రానికి వచ్చేశాయని, ఇంకా 4,500 వీవీప్యాట్‌లు రావాల్సి ఉందని, అవికూడా ఒకట్రెండు రోజుల్లో బెంగళూరు నుంచి వస్తాయని చెప్పారు.
తనిఖీ బృందాల్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్‌లు
2014 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన కోడ్ ఉల్లంఘన కేసులు రెండు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని శాంతి భద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. సరైన పత్రాలుంటే ఎంత నగదైనా తీసుకెళ్లొచ్చని ఆయన చెప్పారు. లేనిపక్షంలో రూ.10 లక్షలలోపు నగదు పట్టుబడితే ఆ కేసును పోలీసులు, రూ.10 లక్షల పైగా నగదు పట్టుబడితే ఆ కేసును ఆదాయపన్ను శాఖ విచారిస్తాయని చెప్పారు. బోగస్ ఫామ్-7 దరఖాస్తులకు సంబంధించి 446 కేసులు నమోదయ్యాయని రవిశంకర్ చెప్పారు. ఎన్నికల సమయంలో ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎఫ్‌ఐయూ ప్రతి రోజు అనుమానాస్పదంగా జరిగే లావాదేవీలపై తమకు నివేదిక అందిస్తుందని తెలిపారు.
కోడ్ ఉల్లంఘనలు గుర్తించేందుకు స్టాటిక్ సర్వేలయన్స్ టీమ్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, చెక్‌పోస్టులు పెట్టి పకడ్బందీ నిఘా పెడతామని చెప్పారు. ఈసారి కొత్త స్టాటిక్ సర్వేలయన్స్ టీమ్, ఫ్లయిండ్ స్క్వాడ్ బృందాల్లో ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్‌ను ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. స్క్వాడ్ బృందాల్లో ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్ ఉండడం వల్ల పట్టుబడిన కేసు నేరుగా కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్లవుతుందని రవిశంకర్ చెప్పారు. అలాగే ఈసారి తనిఖీ బృందాల్లోని వారికి బాడీవోర్న్ కెమెరాలు పెడుతున్నామని చెప్పారు. ఏస్థాయి అధికారులను ఎగ్జిక్యూటివ్ మేజిస్ర్టేట్‌లుగా నియమించాలనే అంశంపై కలెక్టర్ల సూచనలు తీసుకుంటామని చెప్పారు.
సిద్ధంగా ఉండండి కలెక్టర్లకు ద్వివేది దిశానిర్దేశం
రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఓట్ల తొలగింపు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) గోపాలకృష్ణ ద్వివేది జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం సచివాలయంలోని రాష్ట్ర ఎన్నికల కార్యాలయం నుంచి అదనపు సీఈవో సుజాత శర్మతో కలిసి 13 జిల్లాల జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ద్వివేది మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా ఓటర్ల నమోదుకు మార్చి 15 చివరి గడువు అని తెలిపారు. సి-విజిల్‌పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం సాంకేతిక సిబ్బందితో శిక్షణ అందిస్తామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున పెయిడ్ న్యూస్, సోషల్ మీడియా వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, ఎంసీఎంసీ కమిటీలు, పరిశీలకులు, సి-విజిల్, సర్వేలయన్స్ బృందాలు కచ్చితంగా పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
The post ఇక మిగిలింది ఐదు రోజులే.. రాష్ట్రంలో 3.82 కోట్ల ఓటర్లు, మీ ఓటు ఉందొ …లేదో … చూసుకోండి appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2UujvSj
No comments:
Post a Comment