etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, March 21, 2019

ఈ ఆలయంలోకి వెళ్లిన వారే కాని.. తిరిగి వచ్చిన వారు లేరు.. ఇంతకీ ఎక్కడ?

చుట్టూ పాల సముద్రాన్ని తలపించే మంచు కొండలు, పచ్చని చెట్లతో పరుచుకున్న అందాలు, కళ్లు తిప్పుకోలేని కాశ్మీర్ సౌందర్యం.. జమ్ముకశ్మీర్‌లోని 22 జిల్లాల్లో ఒక జిల్లా అయిన రిసీ జిల్లాలో శివఖోరి అనే ఓ శివాలయం ఉంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయానికి చాలానే చరిత్ర ఉంది. నిజానికి ఇది ఆలయం అన్న పేరే కాని అసలు అలా కనిపించదు. గుహలా ఉంటుంది. ఈ గుహలోనే పరమశివుడు కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. దాదాపు 200 మీటర్ల పొడవుండే ఈ గుహలోని శివలింగం స్వయంగా రూపుదిద్దుకున్న లింగం అని ఇక్కడి భక్తుల నమ్మకం. ఆలయంలో ఎప్పుడూ రెండు పావురాలు ఉంటాయని, అవి పుణ్యం చేసిన వారికి మాత్రమే కనిపిస్తాయని అంటారు. ఇక ఈ గుహ నుంచి అమర్‌నాథ్‌కు వెళ్లే మార్గం కూడా ఉంది. ఇంతకు ముందు ఒకసారి శివ భక్తులుగా పిలువబడే అఘోరాలు, సాధువులు ఈ మార్గం గుండానే అమర్‌నాథ్ యాత్రకు వెళ్లారట.

అయితే అలా వెళ్లిన వారెవరూ అక్కడికి చేరుకోపోగా, తిరిగి రానుకూడా లేదు. వారు ఏమైపోయారో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గుహలోపలికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. కేవలం మహాశివరాత్రికి మూడు రోజుల ముందు మాత్రమే శివఖోరి ఆలయాన్ని తెరుస్తారు. మంచు కొండల నడుమ ఉన్న ఈ ఆలయాన్ని బయట నుంచి చూసేవారే కానీ లోపలికి అడుగుపెట్టాలంటే భయపడుతుంటారు భక్తులు. సృష్టిలో ఎన్నో చిత్రాలు, మరెన్నో వింతలు. అందులో శివఖేరి ఆలయం ఒకటి.

The post ఈ ఆలయంలోకి వెళ్లిన వారే కాని.. తిరిగి వచ్చిన వారు లేరు.. ఇంతకీ ఎక్కడ? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2ThXEw1

No comments:

Post a Comment