etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, March 24, 2019

ఏడుస్తున్న పిల్లాడి నోరు మూయించేందుకు.. కన్నతల్లి చేసిన పని చూస్తే..

చంటి పిల్లాడు ఏడుస్తుంటే.. చందమామని చూపించి పాట పాడుతుంది తల్లి. లేదా చిన్నారిని ఎత్తుకుని గుండెలకు హత్తుకుంటుంది. పిల్లాడిని ఉయ్యల్లో ఊపుతూ.. మధురమైన పాటను ఆలపిస్తుంది. ఇంకా పిల్లవాడు ఏడుస్తు విసుగిస్తుంటే.. ఆపమని అరుస్తు.. కసురుకుంటుంది. అప్పటికీ చిన్నారి ఏడుపు ఆపకుంటే ఓ దెబ్బ కొడుతుంది. కానీ ఏడుసున్న పిల్లవాడిపై కన్నతల్లే కర్కశంగా వ్యవహరించిన ఘటన బిహార్‌లో చోటుచేసుకుంది.

ఆపకుండా ఏడుస్తున్న చిన్నారి నోరు మూయించేందుకు ఓ తల్లి.. ఏకంగా పిల్లాడి పెదాలకు ఫెవీక్విక్‌ రాసి అంటించేసింది. బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన పిల్లాడి తండ్రికి ఇల్లంతా నిశ్శబ్ధంగా ఉండటంతో బాబు నిద్రపోయాడు అనుకున్నాడు. దీంతో ఆ చిన్నారి దగ్గరికి వెళ్లాడు తండ్రి. అయితే పిల్లావాడి నోటి నుంచి నురుగు వస్తుడటంతో తండ్రీ ఒక్కసారిగా ఖంగారు పడ్డాడు. ఏం జరిగిందని భార్యను అడిగాడు. ఆపకుండా ఒకటే ఏడుస్తున్నాడని.. దీంతో గమ్‌ రాసినిట్లు చెప్పింది. వెంటనే బాబును ఆస్పత్రికి
తీసుకువెళ్లాడు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు.

The post ఏడుస్తున్న పిల్లాడి నోరు మూయించేందుకు.. కన్నతల్లి చేసిన పని చూస్తే.. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2usxdde

No comments:

Post a Comment