ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నా అనుకోకుండా మొబైల్ స్క్రీన్‌పై గీతలు పడుతుంటాయి. మరి వాటిని తొలగించుకోవడానికి ఈ చిన్న చిట్కాలు ఉపయోగించి చూస్తే స్క్రీన్ మళ్లీ కొత్తగా కనిపిస్తుంది. మరింకెందుకు ఆలస్యం.. చేతిలోనుంచి జారి పొరపాటున కింద పడిపోతే స్క్రీన్‌పై గీతలు పడతాయి. కొన్ని చిన్న చిన్న చిట్కాల ద్వారా స్క్రీన్ గీతల్ని కనిపించకుండా చేసుకోవచ్చు. ఇందుకోసం బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను తీసుకుని దానికి కొద్దిగా నీటిని కలిపితే పేస్టులా తయారవుతుంది. దీనిని ఒక పొడి క్లాత్‌పై ఉంచి నెమ్మదిగా ఫోన్ గీతలపై సర్కిల్ ఆకారంలో రుద్దాలి. ఇలా చేస్తే స్క్రీన్ గార్డ్ మెరుస్తుంది.
రోజూ బ్రష్ చేసుకునేందుకు ఉపయోగించే టూత్ పేస్ట్ కూడా స్క్రీన్‌పై గీతల్ని కనిపించనివ్వదు. కొద్దిగా పేస్టు వేలిపై తీసుకుని స్క్రీన్‌పై నెమ్మదిగా రుద్దాలి. ఆ తరువాత మెత్తని పొడి బట్టతో నీట్‌గా తుడిచేయాలి. మరో పద్దతి ట్రాన్స్‌పరెంట్ నెయిల్ పాలిష్‌లో బ్రష్ ముంచి.. ఫోన్ గీతలపై రుద్దాలి. అది పొడిగా అయిన తరువాత పొడి క్లాత్‌పై కొద్దిగా వెజిటబుల్ ఆయిల్ తీసుకుని స్క్రీన్‌పై అద్దాలి. తరువాత స్క్రీన్‌ను మెత్తటి బట్టతో తుడిస్తే సరిపోతుంది.
The post మొబైల్‌పై గీతలు పడితే ….? ఇలా చేస్తే మటుమాయం….! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FvErDz
No comments:
Post a Comment