పచ్చగా కనిపించే ఆకుకూరల్లో కనిపించని ప్రయోజనాలెన్నో. తక్కువ ధరకి దొరికే ఆకు కూరల్లో ఎక్కువ విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా పాలకూరను ఆహారంలో తీసుకోవడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఐరన్, కాల్షియం, ప్రొటీన్, కార్బొహైడ్రేట్స్, ఫైబర్, ఖనిజాలు, మెగ్నీషియం, ఇనుము, అమైనో ఆమ్లాలు మరియు ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు విరివిగా లభ్యమవుతాయి. దీన్ని కూరగాను, జ్యూస్‌గానూ తీసుకోవచ్చు. ఎన్నో పోషక విలువలు కలిగిన పాలకూర వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి. దీనిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వలన రక్తపోటుని నియంత్రిస్తుంది. గుండె వ్యాధుల నిరోధానికి పనిచేస్తుంది. కండరాలను బలోపేతం చేసే ప్రొటీన్ తత్వాలను కలిగి ఉంటుంది.
ఊబకాయంతో బాధపడేవారు క్రమం తప్పకుండా పాలకూరకు, క్యారెట్ కలిపి జ్యూస్ తీసుకుంటే కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. కంటికి మేలు చేసే విటమిన్ ‘ఎ’ ఎక్కువగా ఉండడంతో కంటి చూపు మెరుగుపడుతుంది. పక్షవాతాన్ని నివారించే విషయంలో పాలకూర సమర్థవంతంగా పనిచేస్తుందని చైనీస్ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో నిరూపించారు. దీనిలోని ఫోలిక్ యాసిడ్ కారణంగా ఈ ప్రయోజనం చేకూరుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హైబీపీ ఉన్న 20,702 మందిపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఐరన్ ఎక్కువగా ఉండడంతో రక్తహీనతతో బాధపడేవారికి డాక్టర్లు పాలకూరను సిఫార్సు చేస్తుంటారు. దీనిలో విటమిన్ ఎ తోపాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ కె పాళ్లు కూడా ఎక్కువగా ఉండడంతో రక్తం గడ్డకట్టేందుకు తోడ్పడుతుంది. దీంతో ఎముక సాంద్రత కూడా పెరుగుతుంది. వయసు పెరిగాక వచ్చే అల్జీమర్స్ వాధి బారిన పడకుండా దూరం చేస్తుంది. శరీరంలోని అన్నిభాగాలకు ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్రరక్తకణాల పనితీరును మెరుగుపరచడంలో దీనిలో ఉన్న ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. పురుషుల్లో వీర్యవృద్ధిని పెంపొందిస్తుంది. ప్రతిరోజూ తగు మోతాదులో పాలకూర జ్యూస్ తీసుకుంటే భాగస్వామితో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి.
The post భాగస్వామితో ఇబ్బందులకూ, పక్షవాతానికీ అద్భుతమైన ఔసుధం, ఏంటో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FtdnEQ


No comments:
Post a Comment