etechlooks

Daily Latest news Channel

Breaking

Thursday, March 14, 2019

బరువు తగ్గాలి అని రాత్రి పూట చపాతీలు తినేవారు తెల్సుకోవాల్సిన విషయాలు..!

ఊబకాయంతో బాధపడుతున్న వారు, లావు తగ్గాలని కోరుకుంటున్న వారు రాత్రి సమయంలో అన్నం మానేయడం చాలా మంచి పద్దతి. రాత్రి సమయంలో మనం చేసే పని ఏమీ ఉండదు. పైగా విశ్రాంతి కోసం నిద్రపోతాం. నిద్రించేప్పుడు మన శక్తి ఏమాత్రం ఖర్చు కాదు. దాంతో నైట్ తిన్న ఫుడ్ ద్వారా వచ్చిన క్యాలరీలు అలాగే పొట్టలో డిపాజిట్ అయిపోతాయి. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాక పోవడంతో కొవ్వుగా మిగిలి పోయి, మనిషి లావు అయ్యే ప్రమాదం ఉంది. రాత్రి సమయంలో భోజనం చేసి, వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి మరింత హానికరం. అందుకే రాత్రి సమయంలో భోజనానికి బదులుగా చపాతి తింటే బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు.

ప్లేట్‌ నిండుగా భోజనం చేసినా ఒకటే, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒక్కటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తినిస్తుందని నిరూపితం అయ్యింది. శక్తిని ఇస్తున్నంత మాత్రాన ఈ చపాతిల్లో కొవ్వు పదార్థాలు ఉండవు. ఎందుకంటే గోదుమల్లో ఎలాంటి కొవ్వు పదార్థాలు ఉండవు. వాటిల్లో ఎక్కువగా విటమిన్‌ బి, ఇ, కాపర్‌, అయోడిన్‌, జింక్‌, మాంగనీస్‌, సిలికాన్‌, మెగ్నీషియం, కాల్షియం వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోదుమల్లో ఐరన్‌ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది.

చపాతీలు చాలా ఈజీగా జీర్ణమవుతాయి. జీర్ణ వ్యవస్థపై ఎలాంటి ఒత్తిడి పడదు. ఏవైనా అతి అనారోగ్యమే. అందుకే చపాతి కూడా ఎక్కువగా తినకూడదు. ప్రతి రోజు మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చపాతిని చాలా తక్కువ నూనెతో కాల్చడం వల్ల ఉపయోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అసలు నూనె వేయకుంటే మరింత మంచింది…

The post బరువు తగ్గాలి అని రాత్రి పూట చపాతీలు తినేవారు తెల్సుకోవాల్సిన విషయాలు..! appeared first on DIVYAMEDIA.



source http://www.divyamedia.in/night-eating-chapati-this-way/

No comments:

Post a Comment