etechlooks

Daily Latest news Channel

Breaking

Monday, March 25, 2019

లక్ష్మీస్ ఎన్టీఆర్’‌కు సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెటో తెలుసా?

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ చిత్రానికి సెన్సార్ .. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమాను మార్చి 29న విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ పర్సనల్ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పాత్రను హైలెట్ చేస్తూ తెరకెక్కించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రను కూడా ఈ చిత్రంలో చూపించారు. దీంతో పలువురు తెలుగు దేశం నాయకులు ఈ చిత్రం విడుదలను నిలిపివేయాలని కోర్టుకు వెళ్లడంతో పాటు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు చిత్రంలో చంద్రబాబును విలన్‌గా చూపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు, ఎన్నికల సంఘం..ఈ చిత్రం విడుదల ఆపలేమంటూ తేల్చి చెప్పింది. సినిమాను యథావిథిగా విడుదల చేసుకోవచ్చని తెలిపాయి. దీంతో సెన్సార్ బోర్డు కూడా ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

కాగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో థియేటర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్, లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞశెట్టి, చంద్రబాబు నాయుడు పాత్రలో శ్రీతేజ్ నటించారు. రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ రెడ్డి, దీప్తి బాలగిరి నిర్మించారు.

The post లక్ష్మీస్ ఎన్టీఆర్’‌కు సెన్సార్ పూర్తి.. ఏ సర్టిఫికెటో తెలుసా? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2JzFxSz

No comments:

Post a Comment