ప్రముఖ సినీ నటుడు, విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకున్నారు. మంగళవారం ఉదయం మోహన్ బాబు, మంచు విష్ణు లోటస్‌పాండ్‌కు చేరుకుని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని కలిశారు. సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పలు విషయాలపై చర్చించారు. ముఖ్యంగా ఇటీవల ఫీజు రియింబర్స్‌మెంట్ వివాదంపై స్పందించినట్లు సమాచారం. అనంతరం మంచు మోహన్‌బాబుకు.. జగన్ వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం లోటస్‌పాండ్ నుంచి బయటికొస్తూ వైసీపీ కండువాను చేతిలోని పట్టుకుని వచ్చి మోహన్ బాబు కారెక్కి ఇంటికి పయనమయ్యారు.
కాగా… మంచు మోహన్‌బాబును రాజ్యసభకు పంపాలని వైసీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు మోహన్ బాబు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రూమర్స్‌కు మంగళవారం మధ్యాహ్నంతో ఆ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఇదిలా ఉంటే.. మోహన్ బాబు కుటుంబానికి.. వైఎస్సార్ ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న విషయం విదితమే.
The post బ్రేకింగ్: వైసీపీలో చేరిన మంచు మోహన్ బాబు appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HHl8JA
No comments:
Post a Comment