etechlooks

Daily Latest news Channel

Breaking

Tuesday, March 26, 2019

పవన్‌కు వ్యతిరేకంగా భీమవరంలో పోటీ చేయాలని.. పరుగు తీసిన పాల్, చివరికి ఏమైందో తెలుసా….!

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌ రోడ్డుపై పరుగు తీయడం సంచలనం కలిగించింది. నరసాపురం పార్లమెంట్‌, అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసేందుకు సోమవారం ఆయన నామినేషన్‌ వేశారు. బయటకు హడావుడిగా వచ్చిన పాల్‌ ఒక్కసారిగా పరుగు తీశారు. మీడియా, పోలీసులు ఆయన వెంటపడ్డారు. వంద మీటర్ల దూరం పరుగు తీసి తన వాహనంలో ఎక్కారు. ఏమిటని ఆరా తీస్తే టైం లేదు.. భీమవరం వెళ్లాలి.. పవన్‌ మీద పోటీ చేస్తున్నా.. అని సమాధానం ఇచ్చారు.

భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి కేఏ.పాల్‌కు అవకాశం దొరకలేదు. నామినేషన్‌ దాఖలు చేసేందుకు 3.45గంటలకు రావడంతో అధికారుల తిరస్కరించారు. బయటకు వచ్చిన పాల్‌ చంద్రబాబు, జగన్‌, పవన్‌కల్యాణ్‌ కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసాపురం పార్లమెంట్‌ స్ధానానికి నామినేషన్‌ దాఖలు చేసిన కేఏపాల్‌ అఫిడివిట్‌లో తనకు ఆస్తులు, అప్పులు లేవని చూపించారు. అఫిడవిట్‌లో అన్ని కాలమ్స్‌ ఎన్‌ఏ (నాట్‌ అప్లికబుల్‌గా)గా చూపించారు.

The post పవన్‌కు వ్యతిరేకంగా భీమవరంలో పోటీ చేయాలని.. పరుగు తీసిన పాల్, చివరికి ఏమైందో తెలుసా….! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2WqIJBU

No comments:

Post a Comment