etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, March 29, 2019

సరదా కాస్తా ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. నేను తప్పు చేశాను.. నన్ను క్షమించు…..!

సరదా కాస్తా ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. మరో యువతిని జైలు పాలుచేసింది. టైలర్ స్మిత్, జోర్డాన్ హోల్గెర్సన్ అనే ఇద్దరు స్నేహితులు ఈత కొట్టడానికి వాంకోవర్ పర్యాటక ప్రాంతానికి వెళ్ళారు. సరదాగా ఈత కొడుతూ తన 16 ఏళ్ళ స్నేహితురాలు జోర్డాన్ హోల్గెర్సన్‌ను బ్రిడ్జి పైనుంచి తోసెసింది టైలర్ స్మిత్. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటనలో పోలీసులు టైలర్‌ను అరెస్ట్ చేసి క్లార్క్ కౌంటీ జిల్లా కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో జిల్లా కోర్టు న్యాయమూర్తి డార్విన్ జిమ్మెర్మాన్.. 19 ఏళ్ల టైలర్ స్మిత్‌కు 38 రోజుల జైలు శిక్ష విధించారు.

గత ఏడాది ఆగస్ట్ 7న ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ కేసుపై బుధవారం కోర్టు విచారణ జరిపింది. ఈ కేసు విచారణకు బాధితురాలు హోల్గెర్సన్ కూడా కోర్టుకు హాజరయ్యారు. జడ్జిమెంట్ సమయంలో అప్పటి విషాధ ఘటనను గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ప్రమాద సమయంలో హోల్గెర్సన్ తీవ్ర భయాందోళనకు గురైంది.నీటిలో పడినప్పుడు ఆమె చనిపోతానని భావించింది. కానీ అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిందని హోల్గెర్సన్ తరపు న్యాయవాది జడ్జికి వివరించారు.

జడ్జిమెంట్ అనంతరం టైలర్ కోర్టు నుంచి బయటకు వెళ్తూ తప్పు చేశాను అంటూ హోల్గెర్సన్ క్షమాపణలు కోరింది. తాను చేసిన తప్పుకు ప్రశ్చాత్తాపడుతూ విచారం వ్వక్తం చేసింది. వారి కుటుంబ సభ్యులను చూసి కన్నీటిపర్యంతమైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

The post సరదా కాస్తా ఓ యువతి ప్రాణాల మీదకు తెచ్చింది. నేను తప్పు చేశాను.. నన్ను క్షమించు…..! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2FJk7OZ

No comments:

Post a Comment