ప్రస్తుతం మనలో అధిక శాతం మంది రాత్రి పూట చాలా ఆలస్యంగా నిద్రపోతున్నారు. టీవీ చూడడమో, గేమ్స్ ఆడడమో… లేదా పలు ఇతర కారణాల వల్ల కూడా అనేక మంది ఆలస్యంగా నిద్రకు ఉపక్రమిస్తున్నారు. దీంతో ఉదయం కూడా ఆలస్యంగానే నిద్ర లేస్తున్నారు. అయితే నిజానికి ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. రాత్రి పూట త్వరగా నిద్రపోయి మరుసటి రోజు ఉదయాన్నే త్వరగా మేల్కొనాలని వైద్యులు చెబుతుంటారు. కానీ ఈ సూచనలను కొందరు మాత్రం అస్సలు పాటించరు. అయితే రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారి పట్ల తాజాగా చేసిన సర్వేలు షాకింగ్ విషయాలను వెల్లడిస్తున్నాయి. యూకేలో ఆలస్యంగా నిద్రపోయే కొందరిని సైంటిస్టులు సర్వే చేశారు. దీంతో తేలిందేమిటంటే.. ఆలస్యంగా నిద్రించడం వల్ల మెదడు పనితీరు మందగిస్తుందట. జ్ఞాపకశక్తి తగ్గుతుందట. ఏకాగ్రత, చురుకుదనం పోతాయట. అలాగే ఏ విషయాన్ని కూడా అంత సీరియస్‌గా పట్టించుకోరట. దీంతో వారికి నిత్య జీవితంలో అవరోధాలు ఏర్పడుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక ఎవరైనా సరే.. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే.. రోజూ రాత్రి త్వరగా నిద్రపోయి, మరుసటి రోజు త్వరగా నిద్ర లేవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
The post ఆలస్యంగా నిద్ర పోతున్నారా..? మెదడు పనితీరు తగ్గుతుందట..! ఎన్నో ..? appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/late-sleeping-very-denjours/
No comments:
Post a Comment