మనం నిత్యం అనేక రకాల వంటకాల్లో వెల్లుల్లిని ఎక్కువగా వేస్తుంటాం. దీంతో ఆహార పదార్థాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే కేవలం రుచికే కాకుండా వెల్లుల్లి మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీంట్లో ఉండే అనేక ఔషధగుణాలు మనకు కలిగే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే పరగడుపున 3 వెల్లుల్లి రెబ్బలను అలాగే పచ్చిగా తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వెల్లుల్లిలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. ఇది వెల్లుల్లికి ఒక రకమైన ఘాటు వాసనను తెచ్చిపెడుతుంది. అయితే ఈ సల్ఫర్ రక్తనాళాల్లో గార (ప్లాక్) పేరుకుపోకుండా చూస్తుంది. ఇక వెల్లుల్లిలోని ఆజోయేన్ రక్తం గడ్డ కట్టకుండా చేస్తుంది. దీని వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. హార్ట్ ఎటాక్‌లు, స్ట్రోక్స్ రావు.
2. వెల్లుల్లిలో ఉండే ఆలిసిన్ అనే పదార్థం యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఇది మనల్ని ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి రక్షిస్తుంది. రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది. బీపీ కంట్రోల్ అవుతుంది.
3. వెల్లుల్లిలోని పాలీ సల్ఫయిడ్లు శరీరంలోకి వెళ్లాక హైడ్రోజన్ సల్ఫయిడ్ వాయువుగా మారతాయి. ఇది రక్తనాళాలను సాగేలా చేసి రక్తపోటు తగ్గడానికి తోడ్పడుతుంది.
4. తరచుగా జలుబు బారిన పడేవారు వెల్లుల్లిని రోజూ తీసుకుంటే మంచి ఫలితం కనబడుతుంది. ఇతర శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. మన శరీరం ఐరన్‌ను గ్రహించుకునేలా చేయడంలో ఫెర్రోపోర్టిన్ అనే ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలోని డయాలీల్ సల్ఫయిడ్లు ఈ ఫెర్రోపోర్టిన్ ప్రోటీన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో శరీరం ఐరన్‌ను గ్రహిస్తుంది. తద్వారా రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు.
6. వెల్లుల్లిలోని డయాలీల్ సల్ఫయిడ్, థియోక్రెమోనోన్‌లు వాపు నివారకాలుగా ఉపయోగపడతాయి. అంటే వెల్లుల్లిని రోజూ తింటే శరీరంలో ఉండే వాపులు, నొప్పులు తగ్గుతాయి.
7. వెల్లుల్లిలో ఉండే ఆలీల్ సల్ఫయిడ్లు కొన్ని రకాల క్యాన్సర్ల నివారణకూ తోడ్పడతాయి. దీని వల్ల క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది.
8. ఇన్సులిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే ఔషధ గుణాలు వెల్లుల్లిలో ఉంటాయి. దీని వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గి డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
9. వెల్లుల్లిని రోజూ తింటే డిప్రెషన్ నుంచి బయట పడవచ్చు. మానసిక ప్రశాంతత కలుగుతుంది.
The post పరగడపున ఓ వెల్లుల్లి రెబ్బ చాలు.. అద్భుతాలు చూస్తారు.. డాక్టర్లు, మెడిసిన్స్ అవసరమే రాదు! appeared first on DIVYAMEDIA.
source http://www.divyamedia.in/early-morning-eating-vellully/


No comments:
Post a Comment