ఆహార పదార్థాలను వండేందుకు మార్కెట్‌లో మనకు అనేక రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కరు తమ ఇష్టాలకు అనుగుణంగా ఒక్కో నూనెను వాడుతుంటారు. అయితే ప్రస్తుత తరుణంలో ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తూ, పోషకాలను అందించే నూనెను తీసుకోవడం తప్పనిసరి అయింది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా అలాంటి కోవకే చెందే అవిసె నూనెను కేవలం నూనె గానే కాకుండా గింజల రూపంలో నిత్యం మన ఆహారంలో భాగంగా తీసుకుంటే దాంతో బోలెడు ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒమెగా -3 ఫ్యాటీ యాసిడ్స్ అవిసె గింజలలో పుష్కలంగా ఉంటాయి. చేపల వంటి మాంసాహారం తరువాత ఆ యాసిడ్లు అధికంగా లభించే ఆహారాల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిలో పీచు పదార్థం(ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి మంచిది. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. ఈ గింజల్ని మెత్తగా పొడిచేసి చపాతీ పిండి, దోశ పిండి, ఇడ్లీ పిండిలో కలుపుకొని వాడవచ్చు.
2. అవిసె గింజలలో కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి శరీరంలో వేడిని పుట్టిస్తాయి. ఈ గింజలు కొలెస్ట్రాల్‌ని, రక్తపోటుని, మధుమేహన్ని అదుపులో ఉంచుతాయి. వీటిని ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే ‘అలసట’ నుంచి ఉపశమనం పొందవచ్చు.
3. మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఆరోగ్యానికే కాక అందానికి కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయి. జుట్టుని ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుతాయి. యాంటీ ఏజింగ్ లక్షణాలు అవిసెల్లో పుష్కలంగా ఉన్నాయి.
4. అవిసెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటాక్సిడెంట్లు, పీచు ఎక్కువ. షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులను నివారించటంలో అవిసె నూనె సమర్థమైనదని పరిశోధనల్లో కూడా రుజువైంది. అవిసె గింజల ద్వరా పూర్తి ప్రయోజనం దక్కాలంటే వాటిని దంచి, పొడి చేసి లేదా నూనె రూపంలో తీసుకోవాలి.
5. అవిసె నూనె వాడితే ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లనుంచి రక్షణ పొందవచ్చు. మెనోపాజ్ మహిళల్లో వేడి ఆవిర్లు తగ్గుముఖం పడతాయి. రేడియేషన్ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
6. అవిసె నూనెను వేడి చేస్తే దాన్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రమాదకరంగా మారతాయి. కాబట్టి ఈ నూనెను వంట చివర్లో వాడాలి. గ్రిల్, బేక్ చేసేటప్పుడు అవి పూర్తిగా ఉడికాక అవిసె నూనెను పైపూతగా పూయాలి. కూరగాయలు, పప్పుధాన్యాల వంటకాల్లో కూడా అవి పూర్తిగా ఉడికిన తర్వాతే ఈ నూనెను కలపాలి. ప్రొటీన్ షేక్స్, వెజిటబుల్, ఫ్రూట్ జ్యూస్‌లకు అవిసె నూనె కలిపి తీసుకోవచ్చు. కెచప్, సలాడ్స్‌లో కలుపుకుని తినవచ్చు. సూప్స్, స్ట్యూలలో కలిపి తాగవచ్చు.
7. అవిసె గింజలు మెదడుకు శక్తిని పెంచే ఆహారం. వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు ఎమర్జెన్సీగా పనిచేసి డిప్రెషన్‌ను కూడా సమర్ధవంతంగా నివారించగలుగుతాయి. ఆస్తమా, ఎలర్జీల నుండి ఉపశమనం అవిసె నూనె వలన లబిస్తుంది.
8. చుండ్రు సమస్యను సమర్ధవంతంగా నివారించి, పేలు నశించేట్లు చేయడంలో అవిసె నూనెను మించింది లేదు. వెంట్రుకలు కూడా
మళ్ళీ పెరిగి జత్తు చిక్కగా తయారవుతుంది.
9. తలనొప్పితో బాధపడుతుంటే అవిసె నూనెను ఉపయోగించిన వంటలు లేదా అవిసె ఆకును ఆహారంగా తీసుకుంటుంటే తలనొప్పి మటుమూయం అవుతుంది. అలాగే నడివయసులో వచ్చే కీళ్ళ సమస్యలు, నడుము నొప్పితో బాధపడేవారు కూడా అవిసె నూనెతో చేసిన వంటకాలు వాడుతుంటే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
10. అవిసె నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కుష్టువ్యాదితో బాదపడేవారికి ఈ నూనెను వంటలలో ఉపయోగించడం వల్ల మంచి పలితాలుంటాయంటున్నారు ఆయుర్వేద వైద్యులు.
11. కాలిన గాయాలపై అవిసె నూనె నురగను పూస్తే మంట, నొప్పినుంచి ఉపశమనం కలుగుతుంది. అవిసె ఆకును వేయించుకుని మేక పాలలో ఉడకబెట్టుకుని ఆ లేపనాన్ని పుండ్లపై పూస్తే పుండ్లు, కురుపులుంటే మాయమవుతాయి.
The post గుప్పెడు అవిసె గింజలు తింటే కలిగే అంతులేని ప్రయోజనాలు..! అవేంటో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2HIxxMH



No comments:
Post a Comment