కోడి గుడ్డు.. మనకు దొరికే ఆహార పదార్థాల్లో అన్ని పోషకాలున్న సంపూర్ణ ఆహారం.. అందుకే మన ప్రభుత్వం, పోషాకాహార నిపుణులు రోజుకో గుడ్డు తింటే ఆరోగ్యం మీ వెంటే అని సూచిస్తున్నారు.. గుడ్డు తింటే మంచిదే.. కానీ కొందరు బ్రాహ్మణులు కానీ.. నాన్ వెజ్ ప్రియులకు ఓ ధర్మ సందేహం ఎన్నాళ్లనుంచో వెంటాడుతోంది. ఇంతకీ కోడిగుడ్డు వెజ్జా.. లేక నాన్ వెజ్జా..? ఈ ప్రశ్నకు ఎవ్వరూ ఖచ్చితమైన సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది..చాలామంది శాకాహారులు గుడ్డును మాంసాహారంగా భావించి దానిని తినరు. వారి అభిప్రాయంలో నాన్‌వెజ్ కేటగిరీకి చెందిన కోడి… ఈ గుడ్డును పెడుతుంది. ఈ కారణంగానే దీనిని నాన్‌వెజ్‌గా భావిస్తారు. అలా అయితే పశువుల నుంచి వచ్చే పాలు శాకాహారం ఎలా అవుతుందనేది నాన్‌వెజ్ ప్రియుల ప్రశ్న. ఈ ప్రశ్నల సంగతి అలా ఉంచితే.. గుడ్డులో మాత్రం ఎన్నో రకాల మంచి పోషకాలున్నాయి..
గుడ్డులోని తెల్లని భాగంలో ప్రొటీన్లుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దానిలో ఎంటువంటి జంతు పదార్థం ఉండదు. అంటే ఎగ్‌వైట్ శాకాహారమని తేల్చిచెప్పారు. ఇక పచ్చసొన విషయానికొస్తే దానిలో అత్యధికంగా ప్రొటీన్లు, కోలెస్ట్రాల్ ఉంటుంది. అయితే మరో కోడితో సంపర్కం జరిగినప్పుడే ఇది మాంసాహారంగా మారుతుంది. కోడి జన్మించిన ఆరు నెలల తరువాత ఒకటి లేదా రెండు రోజులకు గుడ్డును పెడుతుంది. అయితే ఈ ప్రక్రియ కోడిపెట్ట లేదా పుంజుతో సంపర్కం అవసరం లేకుండానే జరుగుతుంది. కాబట్టి గుడ్డు శాఖాహారమని కొందరు వాదిస్తున్నారు.. ఎవరి నమ్మకాలు ఎలా ఉన్నా.. ఎన్నో పోషకాలున్న గుడ్డును ఇలా నాన్ వెజ్ పేరు తో పక్కకు పెడితే.. ఆ సంపూర్ణ ఆహారానికి మీరు దూరమైనట్టే..
సాధారణంగా మనకు చౌక ధరలో అందుబాటులో ఉండే మంచి పోషకాహారం కోడి గుడ్డు. కోడి గుడ్డు ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా.. బీ6, బీ12 తోపాటు కాల్షియం, ఐరన్, జింక్, పోలిక్ యాసిడ్, పాస్పరస్, పోటాషియం , కాపర్, మెగ్నీషియం, ఇంకా అనేక పోషకాలు ఇందులో ఉన్నాయి. అయితే గుడ్డును తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. గుడ్డులో ఉండే విటమిన్-ఇ.. మీ చర్మ కాంతిని పెంచేందుకు దోహదపడుతుంది. ప్రతిరోజు గుడ్డు తింటే అందులోని ప్రోటీన్లు మీ చర్మ కణాలను శుద్ధి చేసి మెరుపును తీసుకువస్తాయి..కోడిగుడ్డులో కెరోటినాయిడ్లు, ల్యూటిన్ అనే పోషకాలుంటాయి. ఇవి కంటి సంబంధిత వ్యాధులను దూరం చేస్తాయి. కోడి గుడ్డులో శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలు ఉంటాయి.
ప్రతిరోజు గుడ్డును ఆహారంలో తీసుకోవడం వల్ల మీ జుట్టు పెరుగుదలను పెంచుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. అంతేకాకుండా గుడ్డును తలకు అప్లై చేసుకోవడం వల్ల అందమైన కురులను సొంతం చేసుకోవచ్చు. గుడ్డు ఒక మంచి పోషకాహారం. చిన్న పిల్లలతోపాటు వయసు పైబడిన వారు కూడా గుడ్డును తినవచ్చు. ఇది ఎదిగే పిల్లలకు కావలసిన పోషకాలను అందిస్తుంది.గుడ్డులో ఉండే ప్రోటీన్స్ వల్ల లభించే కేలరీల వల్ల మీ శరీరానికి బరువు పెరగని బలాన్ని ఇస్తుంది. అందువల్ల బరువు తగ్గాలి అని అనుకునే వారు తమ డైట్ లో గుడ్డును చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. గుడ్డు విరివిగా తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే పాస్పరస్ మీ ఎముకల ధృడత్వానికి సాయం చేస్తుంది. ముఖంపై ముడతలను నివారించి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది.
కోడిగుడ్లను ఉడకబెట్టి తింటే మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. కూర లేదా ఫ్రైగా చేసుకొని తినే కన్నా ఉడకబెట్టుకొని తింటేనే గుడ్లలో ఉండే పోషకాలు మనకు ఎక్కువగా అందుతాయి. అదే గుడ్లను తినేందుకు శ్రేయస్కరమైన పద్ధతి కూడా. అయితే కోడిగుడ్లను ఉడకబెట్టాక చాలా సమయం పాటు అలాగే ఉంచి కొందరు తింటారు. నిజానికి గుడ్లను అలా పెట్టకూడదు. ఉడికిన గుడ్లను వెంటనే తినాలి. అందుకు ఎంతవరకు ఆగవచ్చంటే..? ఉడకబెట్టిన గుడ్లను ఫ్రిజ్ లో పెట్టకపోతే ఒక గంటలోపల తినేయాలి. కానీ అంతకు మించి సమయం మించకూడదు. ఎందుకంటే ఉడికిన గుడ్డుపై బాక్టీరియా, వైరస్ లు త్వరగా చేరి అవి చెడిపోతాయి. కనుక ఉడికిన గుడ్డును ఒక గంటలోపే తినాల్సి ఉంటుంది. ఇక బాయిల్డ్ ఎగ్స్ ను పొట్టుతో అలాగే ఫ్రిజ్ లో పెట్టేటట్టయితే రెండు రోజుల వరకు వాటిని నిల్వ ఉంచవచ్చు. పొట్టు తీసిన బాయిల్డ్ ఎగ్స్ ను 24 గంటల వరకు ఫ్రిజ్ లో నిల్వ ఉంచవచ్చు. అయితే బాయిల్డ్ ఎగ్స్ ను ఫ్రిజ్ లో పెడితే గాలి చొరబడని టైట్ కంటెయినర్ లో పెట్టాల్సి ఉంటుంది. దీంతో బాయిల్డ్ ఎగ్స్ పాడవకుండా ఉంటాయి.
ఉదయాన్నే అల్పాహారంగా ఏం తీసుకుంటున్నారు? ఇడ్లీ, ఉప్మా.. లేదంటే మరేదైనా? ఈసారి ఎగ్ ట్రై చేయండి. బ్రేక్ ఫాస్ట్‌గా గుడ్డును తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్డు సంపూర్ణ ఆహారమనే సంగతి తెలిసిందే. ఇందులో మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి. ఎగ్‌లో ఆవశ్యక అమైనో ఆమ్లాలు లభిస్తాయి. గుడ్డులో ఉండే ప్రొటీన్లు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. కాబట్టి బరువు తగ్గడానికి ప్రయత్నిస్తోన్న వారు ఉదయాన్నే గుడ్డు తినడం మంచిది. ఉదయాన్నే గుడ్డు తినే వారు బరువు తగ్గుతున్నట్లు అధ్యయనాల్లోనూ వెల్లడైంది.
మాంసం, గుడ్లలో ప్రొటీన్లు అధికంగా లభిస్తాయి. కానీ మాంసంతో పోలిస్త గుడ్ల ధర చాలా తక్కువ. గుడ్డు పచ్చసొన తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని భావిస్తారు. కానీ ఆ విషయం రుజువు కాలేదు. కాబట్టి గుడ్డు తినడం వల్ల గుండె జబ్బులు వస్తాయనే భయమేం అక్కర్లేదు. గుడ్లలో కొలిన్ అనే ఆవశ్యక న్యూట్రియెంట్ ఉంటుంది. ఇది మెదడు ఎదుగుదలకు, చురుగ్గా పని చేయడానికి తోడ్పడుతుంది. మెమొరీ పవర్ పెరగడానికి, అప్రమత్తత పెరగడానికి కూడా ఇదెంతో అవసరం. ల్యూటిన్, జియాక్సాన్‌థిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుడ్లలో లభిస్తాయి. ఇవి అతినీలలోహిత కిరణాల నుంచి కంటిని కాపాడతాయి. వృద్ధుల్లో శుక్లాలు ఏర్పడటాన్ని తగ్గిస్తాయి. కాబట్టి రోజూ ఉదయాన్నే గుడ్లు తింటే ఆరోగ్యం మీ ఉంటే ఉంటుందని పరిశోధకులు తేల్చుతున్నారు.
The post కోడిగుడ్లు రోజు తింటే మన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా…! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FqITlV
No comments:
Post a Comment