etechlooks

Daily Latest news Channel

Breaking

Sunday, March 17, 2019

ఆ విషయం పవన్ కల్యాణ్ చెప్తారు: వీవీ లక్ష్మీనారాయణ

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు జనసేన పార్టీలో చేరారు. శనివారం రాత్రి పవన్ కల్యాణ్‌తో భేటీ అయి సుదీర్ఘంగా చర్చించిన ఆయన.. ఆదివారం జనసేనాని సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో పవన్ జనసేనను స్థాపించారని చెప్పారు. ‘‘సమాజ నిర్మాణం కోసం మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. ఆనాడు కుటుంబ సమస్యల కారణంగా మాట్లాడడం కుదరలేదు. ఈ రోజు పవన్‌తో కలిసి పని చేసే అవకాశం కలిగింది. భారతదేశం యువతరంతో ఉత్సాహంగా ఉంది. వచ్చే ఐదేళ్లలో వారికి మార్గం చూపితే దేశం రూపురేఖలు మారిపోతాయి. మార్పు తెచ్చే నేత పవన్ కల్యాణ్ మేనిఫెస్టో కూడా చాలా బాగుంది. అన్ని వార్గాల ప్రజలకు అనుగుణంగా ఉంది. ఇటువంటి మేనిఫెస్టో రూపొందించాలంటే ఎంతో సాధన చేసి ఉండాలి. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయడం సాధ్యం కాదన్న ఈ రోజుల్లో మార్పు కోసం పవన్ వచ్చారు. జ్ఞాన సంపద, ధైర్యం, ప్రజాదారణ అనే మూడు లక్షణాలూ పవన్‌లో ఉన్నాయి. నేను ఈ రోజు నుంచి జన సైనికుడిగా ఉంటా.’’ అని లక్ష్మీనారాయణ తెలిపారు.

తాను టీడీపీలోకి వెళ్తున్నట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టేనని, మార్పు కోసమే తాను జనసేనలో చేరానని వీవీ లక్ష్మీనారాయణ చెప్పారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఈ రోజు సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారన్నారు. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తుల కారణంగా జనసేన మరింతగా జనంలోకి వెళ్తుందని చెప్పారు. వైసీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలు రెండు వందల శాతం అబద్ధమన్నారు. వృత్తి పరంగా తాను ఎంత నిజాయితీగా వ్యవహరించానో తన అంతరాత్మకే తెలుసని మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

The post ఆ విషయం పవన్ కల్యాణ్ చెప్తారు: వీవీ లక్ష్మీనారాయణ appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA https://ift.tt/2HBIsI4

No comments:

Post a Comment