సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనులను చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు తమను కావాలని ఇబ్బందులు పెడుతోందని ఆర్జీవీ పేర్కొంటున్నారు. దీంతో బోర్డుపై కేసు పెట్టబోతున్నట్టు ఆయన ప్రకటించారు.
ఏపీలో తొలిదశ పోలింగ్ ముగిసే వరకూ సినిమా సెన్సార్‌ను వాయిదా వేస్తామని బోర్డు తెలిపింది. దీనిపై ఆర్జీవీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సెన్సార్ బోర్డుకు సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసే అధికారం సెన్సార్ బోర్డుకు లేదని… కేవలం సర్టిఫికెట్ జారీ చేసే అవకాశం మాత్రమే ఉందన్నారు. చట్ట విరుద్ధంగా తన సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్ బోర్డు ప్రయత్నిస్తోందని.. కాబట్టి తాను కేసు నమోదు చేయబోతున్నట్టు ఆర్జీవీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
The post ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను సెన్సార్ బోర్డు అడ్డుకుంటోంది.. కేసు పెడతా: ఆర్జీవీ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2FheU0O
No comments:
Post a Comment