మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతం పథకంలో మరో కుట్రకోణం వెలుగులోకి వచ్చింది. ఇటీవల వైఎస్ వివేకా ఇంటి పరిసరాల్లో ఉన్న ఓ కుక్కను గుర్తు తెలియని దుండగులు కర్రలతో కొట్టి చంపారు. ఇంటి ఆవరణ, రహదారి వైపు కొత్త వ్యక్తులు ఎవరైనా తచ్చాడితే రయ్యిన మొరుగుతూ వారిపైకి ఉరికేది. అటు వైపు కొత్త వ్యక్తులు వచ్చేందుకు సాహసం చేయలేని విధంగా పరిస్థితి ఉండేది. అయితే ఇటీవల ఆ కుక్కను ఎవరో కొట్టి చంపారు. అప్పట్లో వైఎస్ వివేకానందరెడ్డి ఊదాసీనంగా వ్యవహరించిన ఫలితమే ప్రాణాలు మీదకు తెచ్చిందా? అనే అనుమానాన్ని ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు వ్యూహంలో భాగంగా రెక్కీ నిర్వహించడం, లేదా పథకంలో భాగంగా హత్య చేసేందుకు వచ్చినవారిని కుక్క అడ్డగించడంతోనే అప్పట్లో చంపేశారా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
The post వైఎస్ వివేకా హత్యోదంతం నేపథ్యంలో చర్చిస్తున్న అభిమానులు, వెలుగులోకి మరో కుట్రకోణం! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Hui7wr
No comments:
Post a Comment