ఏపీ హైకోర్టు ఆదేశాలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఏపీలో విడుదల కాలేదు. ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రం ప్రీమియర్ షో ఇప్పటికే పూర్తయింది. ఈ చిత్రాన్ని విదేశాల్లో చూసిన నెటిజన్లు ట్వీట్స్ ద్వారా చిత్రంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో లక్ష్మీపార్వతిని అన్యాయానికి గురైన ఒక బాధితురాలిగా, ఎన్టీఆర్‌కు ఎంతో విధేయురాలిగా చూపించారని.. చంద్రబాబును అప్రతిష్టపాలు చేయడానికే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఉందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. చంద్రబాబుపై దురుద్దేశపూర్వకంగా కొన్ని డైలాగ్స్ ఉన్నాయని, ఎన్టీఆర్ లాంటి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌కు ప్రాధాన్యతను తగ్గించి కేవలం లక్ష్మీపార్వతి పాత్ర చుట్టూనే వర్మ కథను నడిపించాడని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భర్త ఉండగానే ఎన్టీఆర్‌ను పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతిని ఉత్తమురాలిగా చూపించేందుకు వర్మ శాయశక్తులా కృషి చేశాడని నెటిజన్లు తేల్చి చెప్పారు. లక్ష్మీపార్వతికి జరగరాని అన్యాయం జరిగిందని… అందుకు కారణం చంద్రబాబేనని చూపించడానికి వర్మ ఎంతగానో శ్రమపడ్డాడనే భావన నెటిజన్లలో వ్యక్తమవుతోంది. వైసీపీ శ్రేణులను సంతృప్తిపరిచే విధంగా… చంద్రబాబును కించపరిచే విధంగా సినిమా ఉందని నెటిజన్లు స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే, వైసీపీకి లబ్ది చేకూర్చేందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను వర్మ తెరకెక్కించాడని సినిమా చూసి బయటికొచ్చిన వారు చెబుతున్నారు.
The post వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై నెటిజన్ల రివ్యూ! ఎలా ఉందొ తెలుసా ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2U1n8mF
No comments:
Post a Comment